
తాజాగా నిన్నటి రోజున అకస్మాత్తుగా తెలంగాణ ఎగ్జిక్యూటర్లు ఫిలిం ఛాంబర్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా పలువురు ఎగ్జిబిటర్లు మీడియాతో మాట్లాడటం జరిగింది.. దర్శకుడు పూరి తో ఎవరు కూడా అగ్ర హీరోలు సినిమాలు తీయవద్దండి కాల్ సీట్లు కూడా ఇవ్వద్దండి అంటూ తెలంగాణ ఎగ్జిక్యూటర్ల సంఘం విజ్ఞప్తి చేస్తోంది. లైగర్ సినిమాని విడుదల చేసి రూ 9 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చారు ఈ సమయంలో పూరి జగన్నాథ్ ఎగ్జిబిటర్లను ఆదుకుంటారని వారికి జరిగిన నష్టాన్ని ఆరు నెలల లోపే తీరుస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని తెలియజేశారు . అంతేకాకుండా లైగర్ బాధితుల సంఘం పేరుతో నిరాహార దీక్షను కూడా చేస్తున్నారు.
లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.. మనమంతా ఇక్కడ గ్యాంబ్లింగ్ ఆడుతున్నాము.. పోకిరి నుండి నేను ఇస్మార్ట్ శంకర్ వరకు నా సినిమాల నుంచి లాభం పొందినప్పుడు ఎవరైనా పంపిణీదారు వారి లాభాలలో తనకు వాటా ఇచ్చారా .. అనే విధంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.. ఇప్పుడు మే 15న పూరి జగన్నాథ్ తో రామ్ పోతినేని సినిమా ప్రారంభించబోయే ముందు ఎగ్జిబిటర్లు ఇలా ప్రతి కారం తీర్చుకోవడానికి సరైన సమయాన్ని చేసుకున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ విషయం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి మరి.