హీరో ఎవరైనా..సిల్క్ స్మిత, డిస్కో శాంతి, షకీలా ఆ సినిమాలో ఉన్నారంటే థియేటర్లకు జనాలు పరిగెత్తుకెళ్లేవారు. ముఖ్యంగా సిల్క్ స్మిత పాట కోసం ఎగబడినట్లే.. మలయాళంలో షకీలా సినిమాల కోసం అడల్ట్స్ ధియేటర్ల ముందు క్యూ కట్టేవారు.

సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా.. కొంత మంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు. మిగిలిన వాళ్లు సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువతో తల్లి, చెల్లి, సోదరి, ఫ్రెండ్, వ్యాంప్ క్యారెక్టర్లకు పరిమితమౌతుంటారు. కొన్ని సార్లు ప్రత్యేక సాంగ్స్, సీన్స్ కోసం కొంత మందిని కేటాయించేవారు. అలాంటి నటీమణుల్లో సిల్క్ స్మిత, డిస్కో శాంతి, షకీలా ఉంటారు. హీరో ఎవరైనా.. వీరు ఆ సినిమాలో ఉన్నారంటే పురుష పుంగవులు థియేటర్లకు పరిగెత్తుకెళ్లేవారు. ముఖ్యంగా సిల్క్ స్మిత పాట కోసం ఎగబడినట్లే.. మలయాళంలో షకీలా సినిమాల కోసం అడల్ట్స్ ధియేటర్ల ముందు క్యూ కట్టేవారు. ఆమె శృంగార భరితమైన సినిమాల్లో నటించి పాపులారిటీని తెచ్చుకున్న సంగతి విదితమే. హీరో లేకపోయినా.. కేవలం తెర మొత్తం ఆమె పండించే హావ భావాల కోసం రసికులు థియేటర్లలో వాలిపోయేవారు.

షకీలా సినిమాలకు చాలా డిమాండ్ ఉండేది. ఆ సినిమాలు కూడా తెలుగులో కూడా డబ్బింగ్ జరిగి.. టాలీవుడ్ వారికి కూడా శృంగార సుందరిగా పేరు గాంచింది. బడా హీరోలు సైతం వసూలు చేయలేని కలెక్షన్లు ఆమె సొంతం. ఆ తర్వాత మెల్లిగా ఆ సినిమాలు చేయడం మానేసి.. వ్యాంప్ క్యారెక్టర్లకు పరిమితమైంది. ఆమె అడల్ట్ సినిమాలు చేయడం వెనుక ఎంతో విషాద గాధ ఉంది. ఎన్నో కష్టాలు పడింది. కుటుంబం కోసం శృంగార తారగా పేరు గడించింది. అయితే వృత్తిపరంగా ఎలా ఉన్నా, వ్యక్తి పరంగా చాలా సున్నిత మనస్కురాలు. సొంత వారి చేతిలోనే మోసానికి గురైంది. అయితే గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.

సెక్స్ అనేది బయోలాజికల్ నీడ్ అన్న ఆమె.. తాను ఇలాంటి మూవీస్ చేసే సమయంలో.. ఏం ఫీల్ కాలేదని అన్నారు. కెమెరాలు ఉంటాయని, లైట్ మెన్స్ ఉంటారని అన్నారు. ఓ సినిమాలో తన పెద్ద నాన్న కొడుకుతోనే అలాంటి సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందన్నారు. అన్నయ్యతో ఆ సీన్స్ చేసేటప్పుడు అదొక యాక్టింగ్‌లా ఫీల్ అయ్యాయని, ఎటువంటి సెక్సువల్ థాట్స్ రాలేదని బోల్డ్ కామెంట్స్ చేశారు. ఫోర్స్ స్టార్‌గా అయినప్పటికీ కూడా తనను తేజ లాంటి డైరెక్టర్లు చాలా మర్యాద ఇస్తున్నారని అన్నారు. తెలుగులో జయం, తొట్టిగ్యాంగ్, కొబ్బరి మట్ట, ఫూల్స్, మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు వంటి చిత్రాల్లో నటించిన సంగతి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: