టాలీవుడ్  స్టార్ హీరో..మాస్ మహారాజ్ రవితేజ ఈసారి పక్కా ప్లాన్ తో వెళ్తున్నాడు. పాన్ఇండియాను టచ్ చేస్తున్న రవితేజ.. కోసం రంగంలోకి ఐదుగురు స్టార్ హీరోలు దిగబోతున్నారు.

గెలుపోటములతో సబంధం లేకుండా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. 2023 మిడ్ రాకముందే.. రెండు సినిమాలతో సందడి చేశాడు రవితేజ. అందులో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా నటించిన  వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ అవ్వగా.. తానుహీరోగా నటించి..ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన  రావణాసుర సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇక నెక్ట్స్ సినిమాతో కాస్త జాగ్రత్తపడబోతున్నాడు రవితేజ్

ప్రస్తుతం మాస్ మహారాజ్ టైగర్‌ నాగేశ్వరరావు ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈసినిమాతో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాను టచ్ చేయబోతున్నాడు. స్టూవర్ట్ పురంగజదొంగ నాగేశ్వరావ్ లైఫ్ జర్నీ ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతోంది. ఇక రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ను చకచకా స్టార్ట్ చేశారు. ఇక ఈమూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 20న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈసారి ప్రమోషన్స్ కూడా తగ్గేదేలే అన్నట్టు చేసేస్తున్నారు.  ఇప్పటి నుంచే ప్రమోషన్లతో హైప్‌ తీసుకురావాలని మేకర్స్‌ పక్కా ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్‌ పోస్టర్‌ను మే 24న రిలీజ్‌ చేయనున్నారు. రవితేజ్ పాత్రను పరిచయం చేయడం కోసం ప్రతీ భాష నుంచి ఒక స్టార్ రంగంలోకి దిగబోతున్నారు.

హీరో పాత్రను పరిచయం చేయడానికి మలయాళంలో దుల్కర్‌ సల్మాన్‌, కన్నడలో శివ రాజ్‌కుమార్‌లు తమ వాయిస్‌లను అందిస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ వెల్లడించారు.ఇప్పటికే వారి వాయిస్ రికార్డ్ కూడా చేశారు. తాజాగా తమిళంలో మాస్ మహారాజ్ పాత్రను యంగ్ హీరో  కార్తి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. తాజాగా కార్తి డబ్బింగ్ చెబుతున్న వీడియోను మూవీ టీమ్  సోషల్ మీడియా లో పంచుకుంది.

ఇక హిందీలో ఈసినిమాకు సల్మాన్ ఖాన్ వాయిస్ ఇస్తున్నట్టు సమాచారం. తెలుగులో ఏస్టార్ హీరో వాయిస్ ఇస్తారో ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈరెండు రోజుల్లో హిందీ,తెలుగు వాయిస్ ఓవర్స్ అయిపోతాయంటున్నారు మూవీ టీమ్. ఇక గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. రాజ్ తరుణ్ తో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా తెరకెక్కించిన  డైరెక్టర్ వంశీకృష్ణ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. పవన్  కాళ్యాణ్ మాజీ భార్య.. రేణుదేశాయ్‌  ఈసినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: