మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ... మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన అద్భుతమైన నటన తో ... అద్భుతమైన డ్యాన్స్ తో అంతకు మించిన క్యారెక్టర్ తో ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... కియార అద్వానీ ఈ మూవీ లో చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత చరణ్ ... బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా చరణ్ ... ఇండియా జీ 20 సమ్మెట్ కు ముఖ్య అతిథిగా వెళ్ళాడు. అందులో భాగంగా చరణ్ తన తండ్రి గురించి కొన్ని అద్భుతమైన విషయాలను చెప్పుకొచ్చాడు. జీ 20 సమ్మిట్ లో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ... నా తండ్రి యొక్క వయసు ప్రస్తుతం 68 సంవత్సరాలు. ఇప్పటికి కూడా నా తండ్రి వరుసగా సినిమాలను ఓకే చేస్తూ వస్తున్నాడు.

అలాగే నా తండ్రి ప్రస్తుతం ఇండియా లోనే అత్యంత భారీ పారితోషకం తీసుకునే నటుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ వయసులో కూడా ఆయన ఉదయం 5 గంటల 30 నిమిషాలకు నిద్ర లేస్తాడు. అలాగే వర్కౌట్లు చేస్తాడు. బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి అనేక కష్టాలు పడుతుంటాడు. ఇలా 68 సంవత్సరాల వయసులో కూడా ఇంతలా కష్టపడుతున్న ఆయనను చూస్తే నాకు ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. నేను కూడా ఆయన్ని చూసి చాలా కష్టపడుతుంటాను... ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అంటూ రామ్ చరణ్ తన తండ్రి అయినటువంటి చిరంజీవి గురించి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: