మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ కి ఒక స్టైల్ ఉంది. అదేంటంటే తన సినిమాలలో ఎక్కువగా మెగాస్టార్ లోని అభినయం కనిపిస్తుంది. అంతేకాదు ఆయన మొదటి సినిమా నుంచి కాస్త తెగువ ఎక్కువగానే చూపిస్తున్నాడు. రేయ్ అన్న సినిమా కమిటయినప్పుడు డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి ఫ్లాప్స్ లో ఉన్నాడు. అయినా తన డెబ్యూ సినిమా ఆయన తోనే కమిటయ్యాడు. ఆ సినిమా రిలీఝ్ కావడం చాలా ఆలస్య అయినా అసలు ఏమాత్రం అధైర్య పడలేదు. అదే ఇంకో హీరో అయితే తన కెరీర్ లో మొదటి సినిమా ఇలా అయిందేంటి అని తెగ కంగారు పడేవాళ్ళు. కాని సాయి ధరమ్ తేజ్‌ మాత్రం కూల్ గా ఉన్నాడు. 

 

ఇక తన రెండవ సినిమా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా కమిటయినప్పుడు కూడా దర్శకుడు రవి కుమార్ చౌదరి ఫ్లాప్ లతో ఉన్నాడు. అయిన తనమీద నమ్మకంతో అతనితో సినిమా కమిటయి హిట్ కొట్టాడు. ఆ దెబ్బతోనే కొత్త దర్శకులు, ఫ్లాప్ డైరెక్టర్స్ సాయి ధరమ్ తేజ్‌ వెనకాల క్యూ కట్టారు. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం కథ నచ్చితే ఆ దర్శకుడు ఫ్లాప్స్ లో ఉన్నా కూడా డేట్స్ ఇచ్చే తెగువ సాయి ధరమ్ తేజ్‌ కి ఉండటం గొప్ప విషయం. అంతేకాదు మెగా హీరోగా సాయి ధరమ్ తేజ్‌ కి డేరింగ్ స్టెప్స్ తీసుకోవడం బాగా అలవాటే. అందుకే మారుతి ఫ్లాప్స్ లో ఉన్నా ప్రతి రోజు పండగే సినిమా కమిటయ్యాడు హిట్ అందుకున్నాడు. 

 

ఇప్పుడు కూడా మరో సారి అలాంటి దమ్ము ధైర్యం తెగువ చూపించాడు. దేవా కట్టా మంచి దర్శకుడన్న పేరున్నప్పటికి ఆయన అకౌంట్ లో ఎక్కువగా బ్లాక్ బస్టర్ సినిమాలు లేవు. ప్రస్థానం సినిమా తప్ప దేవా కట్టా అంటే చెప్పుకోవడానికి మరో సినిమా లేదు. అయినా ఇప్పుడు ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ని నిర్మించే నిర్మాతలు కూడా ఎప్పుడో ఒక సినిమా తీసి ఆ సినిమా భారీగా నష్టాలు రావడంతో సైలెంట్ గా ఉన్నారు.

 

అయితే ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడానికి ముందుకు వచ్చిన ఆ నిర్మాతలని సాయి ధరమ్ తేజ్‌ ఆదుకోబోతున్నాడని అంటున్నారు. సక్సస్ లో లేని దర్శక నిర్మాతలకి ఒకే చెప్పి తనకున్న తెగువ చూపించినందుకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఉలిక్కి పడుతున్నారు. ఇంత చిన్న వయసులో ఈ సాహసాలేంటని ఆశ్చర్యపోతున్నారట. ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: