టాలీవుడ్‌లో కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంటూ, టాప్ హీరోయిన్స్‌గా హంగామా చేసిన చాలా మంది హీరోయిన్లు ఇప్పటికీ తెలుగు మాట్లాడట్లేదు. కానీ ఇప్పుడొస్తున్న యంగ్‌బ్యూటీస్‌ మాత్రం తెలుగు తెలుసుకున్నాకే కెమెరా ముందుకొస్తున్నారు. హండ్రెడ్‌ పర్సంట్‌ ఆర్టిస్ట్‌ అనిపించుకుంటున్నారు.

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్‌ అనిపించుకున్న త్రిష, శ్రియా ఇప్పటికీ వాళ్ల క్యారెక్టర్స్‌కి వాళ్లు డబ్బింగ్‌ చెప్పుకోవడం లేదు.  ఇక్కడి రెమ్యునరేషన్‌పై ఉన్న ఇంట్రెస్ట్, భాష నేర్చుకోవడంపై లేదని ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెంచుకుంటున్నారు. కానీ ఇప్పుడొస్తున్న హీరోయిన్లు మాత్రం సినిమాతోపాటే తెలుగు నేర్చుకుంటున్నారు. భాష, భావం కలగలిసిన ఆర్టిస్టులుగా మెప్పిస్తున్నారు.

మళయాళీ హీరోయిన్ నజ్రియా నజీమ్ ఇప్పటివరకు తెలుగు సినిమా చెయ్యలేదు. కానీ ఫస్ట్‌ మూవీ నుంచే డబ్బింగ్‌ చెప్పుకోవాలనుకుంటోంది నజ్రియా. నాని, వివేక్‌ ఆత్రేయ కాంబోలో వస్తోన్న సినిమాకి ఓన్‌ డబ్బింగ్‌ చెప్పుకోబోతోంది నజ్రియా. అలాగే 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్‌కి వచ్చిన బెంగళూరు బ్యూటీ కృతి శెట్టి కూడా ఓన్‌ డబ్బింగ్‌ చెప్పుకోబోతోంది. నెక్ట్స్‌ నానితో చెయ్యబోయే 'శ్యామ్ సింగారాయ్', ఇంద్రగంటి మోహనక్రిష్ణ-సుధీర్‌ బాబు సినిమాల్లో సొంత గొంతు వినిపించబోతోంది కృతి శెట్టి.

వర్ష బొల్లమ్మ కూడా సొంత గొంతు వినిపిస్తోంది. ఫస్ట్ మూవీ 'చూసీ చూడంగానే' సినిమాకే డబ్బింగ్ చెప్పుకున్న వర్ష బొల్లమ్మ 'మిడిల్‌క్లాస్ మెలొడీస్' సినిమా కోసం గుంటూరు యాస కూడా నేర్చుకుంది. ఇక బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో రొమాంటిక్ ఝలక్స్ ఇచ్చే పాయల్ రాజ్‌పుత్ కూడా తెలుగు నేర్చుకుంది. 'నరేంద్ర' సినిమాకి డబ్బింగ్‌ చెప్పుకుంది పాయల్.

భాష రాదు, భావం తెలియదు.. ఇలాంటి వాళ్లని తీసుకొచ్చి హీరోయిన్స్‌ అంటే బ్లాంక్‌ ఫేసులే కనిపిస్తాయి గానీ ఎమోషన్స్‌ ఎందుకు కనిపిస్తాయి. అందుకే పరభాషా హీరోయిన్లు వద్దని చాలారోజుల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడొచ్చే హీరోయిన్లు ఈ కామెంట్స్‌కి తెలుగులోనే సమాధానం చెప్తున్నారు.

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌ పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇద్దరూ సొంత గొంతునే వినిపిస్తున్నారు. పూజా హెగ్డే మొదట్లో డబ్బింగ్‌ చెప్పుకోకపోయినా, 'అరవింద సమేత'  నుంచి ఓన్ వాయిస్ వినిపిస్తోంది. ఇక రష్మిక మందన్న అయితే వాయిస్‌లోనూ వేరియేషన్‌ చూపిస్తోంది. 'పుష్ప' సినిమా కోసం చిత్తూరు స్లాంగ్‌ కూడా నేర్చుకుంది రష్మిక.





మరింత సమాచారం తెలుసుకోండి: