ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా ఎంతో ప్రత్యేకమైన గుర్తించిన సంపాదించుకున్న కమెడియన్స్ వెండితెరపై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కమెడియన్స్ గా అలరించిన వారు సినిమాలో కూడా కేవలం కమెడియన్స్ రోల్స్ మాత్రమే చేసేవారు  కానీ ఈ మధ్యకాలంలో మాత్రం జబర్దస్త్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఎంతోమంది వెండితెరపై మాత్రం ఇక సరికొత్తగా ప్రయత్నిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటికే వేణు ఎల్దండి లాంటి కమెడియన్ బలగం లాంటి సినిమా తీసి సెన్సేషనల్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు.


 మరోవైపు ధనాధన్ ధన్రాజ్ సైతం ఇక ఎన్నో సినిమాలో కామెడీ రోల్స్ చేయడమే కాదు కొన్ని సినిమాలకు డైరెక్షన్ కూడా చేసి అటువైపుగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇప్పటికే జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగిన అటు సుడిగాలి సుదీర్ సైతం వెండితెరపై హీరోగా రాణిస్తున్నారు. ఇక మొన్నటి వరకు సపోర్టింగ్ రోల్స్ చేసిన గెటప్ శ్రీను సైతం రాజు యాదవ్ అనే సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు. ఇక ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ గా మారబోతున్నాడు. అతను ఎవరో కాదు ఆటో రాంప్రసాద్. సుడిగాలి సుదీర్ స్నేహితుడిగా అతని టీం లో కీలక కమెడియన్ గా కొనసాగాడు ఆటో రాంప్రసాద్.


 తన స్పాంటినియస్ పంచులతో ఆటో రాంప్రసాద్ అనే గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను లను హీరోలుగా పెట్టి ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాడట ఆటో రాంప్రసాద్. ఓ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది  అయితే నిర్మాతలకు కథ నచ్చితే త్వరలోనేఈ సినిమా పట్టాలెక్క పోతుందట. దీనిపై అధికారిక ప్రక్కన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: