తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో మంచి గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో నటి అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ భామ కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో అద్భుతంగా నటించగలదు. చక్కగా మాట్లాడగలదు. తెలుగులో "అ...ఆ" సినిమాతో చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కీలకపాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా అనంతరం తెలుగులో వరుసగా హీరోయిన్ గా నటించే అవకాశాలను పొందింది.


ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తోంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, మలయాళంలోను అనేక సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు అందుకుంటుంది. ప్రస్తుతం అనుపమ చేతిలో వరుసగా పలు సినిమా ప్రాజెక్టులు ఉండడం విశేషం. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం అనుపమకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాలో హాట్ టాపిక్ గా మారుతుంది. అనుపమ తమిళ హీరోతో సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

అయితే ఆ హీరోకు ఇదివరకే వివాహం జరిగి విడాకులు కూడా తీసుకున్నారట. ఆ హీరో మరెవరో కాదు జయం రవి. ఈ హీరో ప్రతి ఒక్కరికి సుపరిచితమే. జయం రవితో అనుపమ సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తుందట. త్వరలోనే వివాహం చేసుకోవాలని కూడా అనుకుంటున్నట్లుగా ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో కోడై కూస్తోంది. వీరిద్దరూ కలిసి "సైరన్" అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరి రొమాన్స్ చూసి ప్రతి ఒక్కరూ వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అందుకే ఇంత డీప్ గా నటిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన అనుపమ, జయం రవి కానీ ఏదో ఒక క్లారిటీ ఇస్తేనే అసలు విషయం బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: