నిజ జీవితంలో పోలీస్ అవ్వాలి అనుకున్న కొంతమంది స్టార్స్ అవ్వలేకపోయారు . అలాంటి కోరికను తెరపై తీర్చుకుంటున్నారు. చాలామంది స్టార్స్ కి పోలీస్ అంటే స్పెషల్ రెస్పెక్ట్ . నిజ జీవితంలో పోలీసులా బతకాలి అని అందరూ అనుకుంటారు . కానీ అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు . కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తమ కోరికని నెరవేర్చుకోవచ్చు.  పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంటూ ఆశపడి పోలీస్ ఆఫీసర్ అవ్వలేక హీరో అయ్యి  ఇండస్ట్రీలో హీరోగా పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించిన స్టార్ హీరో కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆయన మరెవరో కాదు విక్టరీ వెంకటేష్ .


టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఫ్యామిలీ హీరోగా రాజ్యమేలేసిన విక్టరీ వెంకటేష్ .. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.   100 కోట్ల హిట్ ని తన  ఖాతాలో వేసుకున్నాడు.  అసలు  వెంకటేష్ కెరియర్ కతం అయిపోయింది అని సీనియర్ ఏజ్ లో అసలు హిట్ కొట్టలేదు అంటూ చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు . కానీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తనపై వచ్చే ట్రోలింగ్ మొత్తం ఆపేశాడు విక్టరీ వెంకటేష్.  ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే .



కాగా విక్టరీ వెంకటేష్ ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట.  ఇలాంటి మూమెంట్లోనే వెంకటేష్ కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి . విక్టరీ వెంకటేష్ కి చిన్నప్పటినుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్న కోరిక బలంగా ఉండేదట.  ఎప్పుడు టీవీలో చూసిన , బయట పోలీస్ ఆఫీసర్ ని చూసిన.. పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ ప్రజలకి సేవ చేయాలి అనే ఆలోచన ఉండేవాడట .



తాను చదువుకునే రోజుల వరకు కూడా అదే విషయాన్ని అదేవిధంగా బలంగా ఫిక్స్ అయ్యారట.  ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడంతో స్టార్స్ ఇంటికి వస్తూ ఉండడం వాళ్ళ ఫేమ్.. వాళ్ళ క్రేజ్ చూస్తూ పెరగడంతో సడన్గా వెంకటేష్ తను  పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్న కోరిక నుండి హీరో అవ్వాలి అనే విధంగా మార్చుకునేసారట . అయితే సినిమాలో మాత్రం ఒక్కసారైనా పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించాలి అంటూ బాగా ఆశపడ్డారట.  అనుకున్న విధంగానే విక్టరీ వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించి మెప్పించాడు . మరీ ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ నటించిన ఘర్షణ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఎలా ఆకట్టుకున్నాడో అందరికీ తెలిసిందే . అంతకుముందు కూడా విక్టరీ వెంకటేష్ పలు సినిమాలలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించాడు కానీ అన్నిటికన్నా హైలెట్గా నిలిచిన చిత్రం మాత్రం ఘర్షణ అని చెప్పాలి . ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ ల కి కూడా ఘర్షణ సినిమాలోని వెంకటేష్ పాత్ర బాగా నచ్చింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: