కాజల్ ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తనదైన నటన, అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన కాజల్ సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలోనూ హీరోయిన్ గా చేసింది. సినిమాలలో తన కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లు అనే ప్రముఖ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 

చాలా రోజుల తర్వాత కాజల్ మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతోంది. కాగా కాజల్ అగర్వాల్ "రామాయణ" సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. రామాయణ సినిమాలో రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతుంది. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కే జి ఎఫ్ స్టార్ యష్ రావణుడిగా నటించనున్నాడు. యష్ కు భార్య పాత్రలో కాజల్ నటిస్తోంది. 

మండోదరి పాత్రలో చాలా రోజుల నుంచి హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో చిత్ర బృందం సభ్యులు ఉన్నారు. చాలామంది హీరోయిన్లను సంప్రదించినప్పటికీ ఎవరు నటించడానికి ముందుకు రాలేకపోయారు. ఫైనల్ గా మండోదరి పాత్రలో నటి కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేయడంతో తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నారు. మొదటి పార్ట్ ను నవంబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆలోచనలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుందని తెలిసి తన అభిమానులు సంతోషంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: