టాలీవుడ్ హీరో మంచి విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ వహిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు మరొక బ్యానర్ తో కలిసి నిర్మిస్తూ ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, ప్రభాస్ శరత్ కుమార్ అంటే స్టార్ నటీనటులు ఇందులో నటిస్తూ ఉన్నారు. మోహన్ బాబు కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు పోస్టర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ట్రోల్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఏదో ఒక రూపంలో మాత్రం కన్నప్ప సినిమాకి బజ్ మాత్రం ఏర్పడుతోంది.



జూన్ 27న ఈ సినిమాని గ్రాండ్గా థియేటర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేసింది చిత్రం బృందం. ఈ క్రమంలోనే తాజాగా కౌంట్ డౌన్ పోస్టర్ అంటూ చిత్ర బృందం అనౌన్స్మెంట్తో ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా పరమశివుడు పాత్రధారి అక్షయ్ కుమార్ ని పూర్తి లుక్ లో చూపించి సర్ప్రైజ్ చేసింది చిత్రబృందం. అక్షయ్ కుమార్ శివుడు లుక్ లో చాలా ఎక్సైటింగ్ గా కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అచ్చం పరమశివుడు ఎలా ఉంటారో అలాగే చూపించారు. కన్నప్ప సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ చేస్తున్నారు.


మొత్తానికి తన డ్రీమ్ ప్రాజెక్టుని పూర్తి చేసిన మంచి విష్ణు తన సినిమాని ఏవిధంగా సక్సెస్ కొనసాగిస్తారో చూడాలి. ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయిందనే విధంగా టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు కుటుంబంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కన్నప్ప సినిమాని పూర్తి చేసాడు మంచు విష్ణు.. ఇక తన అన్నకు పోటీగా మంచు మనోజ్ కూడా భైరవం సినిమాని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: