సౌత్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చాలా కాలంగా చూస్తున్నాడు ... అయితే ఇదే క్రమంలో వెంకీ అట్లూరీ కి సూర్య సినిమా చేయడానికి ఓకే చెప్పిన విషయం తెలిసిందే .. అయితే ఇప్పుడు తాజా గా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్డేట్స్ ప్రకారం ఈ సినిమా లో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అలాగే ఈ సాంగ్‌ కోసం ఓ బాలీవుడ్ స్టార్ బ్యూటీ ని కూడా తీసుకోవాలని డైరెక్టర్ వెంకి అట్లూరి ప్లాన్ చేస్తున్నారట .. ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది . రాబోయే షెడ్యూల్లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కూడా తెరకెక్కించబోతున్నారు ..

ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం సూర్య తో పాటు దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నారని అంటున్నారు .. అదే విధంగా ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ జెవి ప్రకాష్ , సూర్య సినిమా కు వెంకీ తో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలుపెట్టేశారు ఈ సినిమాకు హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకుని ఆలోచనలో ఉన్నారు అంటూ మొదట వార్తలు వచ్చాయి .. అయితే ఇప్పుడు ఆమె స్థానం లోకి మరో గ్లామర్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని  వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి .  ఇక ఈ సినిమా ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. ఇక మరి ఈ సినిమా తో సూర్య బాక్సాఫీస్ దగ్గర మరోసారి తానెంటో నిరూపించుకుంటాడా లేదో చూడాలి .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: