
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా ... దర్శకులు ఏఎం. జ్యోతి కృష్ణ - క్రిష్ సంయుక్తంగా తెరకెక్కించిన భారీ హిస్టారికల్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. దాదాపు 4 - 5 సంవత్సరాలుగా షూటింగ్ జరుగుతూ 10 సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు ఈ నెల 12 న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో మరోసారి విడుదల తేదీ వాయిదా పడింది. వీరమల్లు రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామని సినిమా నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ గ్యాప్ లో సినిమా విఎఫ్ఎక్స్ పనులను మేకర్స్ మరింత క్వాలిటీతో కంప్లీట్ చేసే పనిలో ఉన్నారట. ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ నెవర్ బిఫోర్ లెవెల్ లో ఉంటుంది అని మేకర్స్ చెప్తున్నారు. దీనిపై మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వినిపిస్తున్నాయి.
వీరమల్లు సినిమాలో మొత్తం 6 వేల వీఎఫ్‌ఎక్స్ షాట్‌లు ఉన్నాయట. ప్రతి షాట్‌లో పది లేయర్స్ ఉంటాయని ... ఇలా మొత్తం వర్క్ ఒక ఎత్తు అయితే ... క్లైమాక్స్ పర్సన్ వీఎఫ్ఎక్స్ కోసమే మేకర్స్ ఏకంగా 25 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆడియన్స్ కు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా సిద్ధం చేస్తున్నారట. ఈ సినిమాకు ఓవరాల్ గా రు. 200 కోట్ల బడ్జెట్ అయినట్టు తెలుస్తోంది. వడ్డీలతో కలుపుకుంటే ఇది రు. 240 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు