
టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అఖండ 2. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సాలిడ్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ దెబ్బతో అంచనాలు ఠారెత్తిపోయి ఉన్నాయి. థియేటర్ల లో విధ్వంసం సృష్టించేందుకు బాలయ్య-బోయపాటి మాస్ కాంబో మరోసారి రెడీ అయిందని ఈ టీజర్ చూస్తే అందరికి క్లారిటీ వచ్చేసింది. ఈ టీజర్ చూసి కేవలం టాలీవుడ్ సినీ లవర్స్ మాత్రమే కాదు .. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పక్కా ప్లానింగ్‌లో ప్రమోట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ‘అఖండ 2’ టీజర్ కోసం మేకర్స్ ఏకంగా రూ.1.6 కోట్లు ఖర్చు పెట్టారట. నిజంగా ఈ బడ్జెట్ ఫిగర్ వింటే ఫ్యీజులు ఎగిరి పోవాల్సిందే. ఈ టీజర్ ఖర్చు చూస్తేనే ఈ సినిమా స్కేల్ ఎలా ఉందో తెలుస్తోంది. అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తుండగా ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు