
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. ఇప్పటికే రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ చేయాల్సి ఉన్న కొన్ని కారణాలతో వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా ? అని అందరూ ఒక్కటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను జూన్ నెలాఖరులో రిలీజ్ చేస్తారని టాక్ ముందుగా వినిపించింది. కానీ మంచు విష్ణు నటించిన ప్రెస్టేజ్ సినిమా కన్నప్ప ఈ నెలాఖరున రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకు ఇబ్బంది కలిగించ వద్దన్న ఉద్దేశంతో వీరమల్లు సినిమాని వచ్చే నెలలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
కానీ జూలై 4న నితిన్ తమ్ముడు .. జూలై 11న అనుష్క ఘాటీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో జులై 18న వీరమల్లు సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ డేట్ అయితే వీరమల్లు కు బెస్ట్ అవుతుందని టాలీవుడ్ కూడా భావిస్తోంది. పోటీ లేకుండా ఉండటం సినిమా ప్రమోషన్లకు కావాల్సిన అంత సమయం ఉండడంతో ఈ డేట్ .. రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ట్రైలర్ లో ఈ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా ... ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు