
ఈ క్రమంలోనే ప్రజెంట్ పాలిటిక్స్ ఏ విధంగా మారిపోయాయి ..? సమాజంలో పరిస్థితులు ఏ విధంగా చేంజ్ అయిపోయాయి ..? అన్న ఇష్యూ గురించి మాట్లాడుతూ ఇలాంటి సమయంలో కచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోని టర్నింగ్ పాయింట్ గా మారిన "ఠాగూర్" సినిమాకి సీక్వెల్ రావాలి అంటున్నారు అభిమానులు.
ఠాగూర్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వి వి నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ అందుకుంది . అప్పట్లో ఓ రేంజ్ లో అల్లాడించేసింది. కాగా ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ ఎప్పటినుంచో ఆశపడుతున్నారు ఫ్యాన్స్. కాగా ఈ సినిమాకి సీక్వెల్ రావడానికి ఇది పర్ఫెక్ట్ టైం అని.. ప్రెసెంట్ సొసైటీలో మారిపోయిన సిచువేషన్ ..పెరిగిపోయిన దారుణాలకి తగ్గట్టు కథను రాసుకొని శేఖర్ కమ్ముల లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు .
కొంతమంది కూసింత ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు . ఈమధ్య జరుగుతున్న దారుణాలకు చేస్తున్న వికృతి చేష్టలకు జనాల మైండ్ మారాలి అన్నా..అలాంటి వాళ్ళ నోర్లు మూయాలి అన్నా ఠాగూర్ లాంటి సినిమాలు రావాల్సిందే అంటూ ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు. చూద్దాం మరి శేఖర్ కమ్ముల ఠాగూర్ టు సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేంత సాహసం చేస్తాడో..? లేదో ..? రీసెంట్ గానే "కుబేర" సినిమా తో హిట్ అందుకున్నాడు శేఖర్ కమ్ముల
..!