సాయి పల్లవి.. ఓ హీరోయిన్ ..స్టార్ హీరోయిన్ .. అందాల ముద్దుగుమ్మ.. రొమాన్స్ చేయదు ..నాటీ సిన్స్ లో నటించదు.  వల్గర్ సీన్స్ చచ్చిన చేయదు.  తాను నమ్మిన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటుంది . సాయి పల్లవి గురించి ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు . అయితే ఇప్పుడు సాయి పల్లవి గురించి మరోలా కూడా మాట్లాడుకుంటున్నారు . ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ కి బుద్ధి వచ్చేలా చేసింది సాయి పల్లవి . రొమాంటిక్ సీన్స్ లో నటించకపోయిన వల్గర్ సీన్స్ చేయకపోయినా.. టాప్ హీరోయిన్ స్ధానాని అందుకోవచ్చు అంటూ ప్రూవ్ చేసింది .


ఎస్ సాయి పల్లవి ఇప్పుడు టాప్ ఫైవ్ హీరోయిన్స్ లలో ఒకరుగా ఉన్నారు. అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్తే అక్కడ బోల్డ్ సీన్స్ లో నటించాలి అన్న ఒక అభిప్రాయాన్ని తుడిచిపెట్టుకుపోయేలా చేసింది.  బాలీవుడ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి రామాయణం సినిమాలో నటిస్తుంది . ఈ సినిమా షూటింగ్ చకచక జరుపుకుంటుంది . అయితే ఇలాంటి మూమెంట్లోనే సాయి పల్లవి మరొక సినిమాకి కూడా సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో.. అది కూడా గెస్ట్ రోల్ లో .. స్టార్ హీరో సినిమాలో సాయి పల్లవి గెస్ట్ రోల్ లో నటించబోతుందట .



ఆయన మరెవరో కాదు అక్షయ్ కుమార్.  బాలీవుడ్ ఇండస్ట్రీలో  తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అక్షయ్ కుమార్ చేస్తున్న మూవీలో సాయి పల్లవి ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతుందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి వెళ్లి ఇలా వల్గారిటీ లేకుండా సినిమాలను చూస్ చేసుకుంటున్న ఏకైక హీరోయిన్గా సాయి పల్లవి చరిత్రను నిలిచిపోతుంది అంటున్నారు అభిమానులు. కాగా ప్రెసెంట్ సాయి పల్లవి - కోలీవుడ్ - టాలీవుడ్ - బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళ్తుంది . అంతేకాదు బాలీవుడ్రామయణం  కోసం ఏకంగా 12 కోట్లు  ఛార్జ్ చేసింది అంటూ వార్తలు వినిపించాయి.  కానీ ఇది ఫేక్ అంటూ కొట్టి పడేస్తున్నారు జనాలు. దీనిపై సాయి పల్లవి ఏ విధంగా రియాక్ట్ అవ్వలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: