
మధ్య తరగతి మామూలు గృహస్తు జీవితం నుంచి విశ్వవిఖ్యాత నటుడుగా,మహానేతగా ఎదగడం వరకు సామాన్య స్థితి నుంచి సంపన్న స్థితికి ఎదగడం వరకు అన్ని దశలలో రామారావుని నీడవలె అనుసరించి సహకరించారు ఆయన సతీమణి బసవతారకం. అన్ని వేళలా ఆయనకు అనుకూలమైన భార్యగా, అణుకువ కలిగిన గృహిణిగా మెలిగారు. 1984 ఆగస్టు సంక్షోభ సమయానికే క్యాన్సర్ తో తీవ్రంగా బాధపడుతున్నారు. మద్రాస్‌లోనే ఆమె తుదిశ్వాస విడిచారు. బసవతారకమ్మ మరణించే సమయానికే ఆరుగురు కుమారులకు,ముగ్గురు కుమార్తెలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి.ఇక మిగిలింది కనిష్ఠ కుమారుడు జయశంకర కృష్ణ, కనిష్ట కుమార్తె ఉమామహేశ్వరి.
జీవితంలో ఒక విజయం,ఒక అపజయం.ఒక ఆనందం ఒక విషాదం.అర్ధాంగిని కోల్పోయిన రామారావుకి జీవితంలో గట్టి దెబ్బ అనుకోవాలి. జీవితమంతా రామారావు గారే సర్వస్వంగా గడిపిన అర్ధాంగి తారకమ్మ. భర్త కోసం,పిల్లల కోసం కరిగిపోయిన కొవ్వొత్తి అయ్యి ఆ కుటుంబంలో వెలుగులు పంచింది. తారకమ్మ మహా ఇల్లాలు.తారకమ్మ చనిపోయినపుడు రామారావు చాలా గంభీరంగా వుండిపోయారని చెపుతారు. సినీ జీవితంలో తొలి సంవత్సరాలలో స్పీడుగా వున్నా క్రమంగా ఆయన భార్య పట్ల ఎంతో అన్యోన్యంగా, ఆత్మీయంగా గడిపారు. వయసుతో పాటు పెరిగిన అనురక్తి అది.
రామారావుది ఒకవిధంగా ఎప్పుడూ ఒంటరి జీవితమే!.ఆయన సగం రోజులు ఔటడోర్ షూటింగ్లలో,టూర్లలో వుండేవారు.ఒకవేళ మద్రాసులో వున్నా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ షూటింగ్!.అందువల్ల భర్త ఆలనపాలన చూడడంతో పాటు కుటుంబం ఆలనపాలన అంతా చూసుకోవడంతోనే తారకమ్మకు సరిపోయేది. అయినా తారకమ్మ మాత్రం ఎప్పుడూ భర్తకు వండి పెట్టడం, ఆయన ఆరోగ్యం చూసుకోవడంతోనే సరిపోయేది. నాలుగు దశాబ్దాల పాటు ఆమె ఆదర్శమైన గృహిణిగా ఉండిపోయింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు