హైదరాబాదు రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనానికి దారితీసిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే `ర‌జాకార్‌`. యాటా సత్యనారాయణ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో నిజాం పాలనా కాలంలో జరిగిన రజాకారుల దురాగతాలను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ విమర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంది. అయితే ఈ సినిమాలో బాబీ సింహ, వేదిక, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, అనసూయ భరధ్వాజ్, మకరంద్ దేశ్‌పాండే వంటి స్టార్స్ న‌టించిన‌ప్ప‌టికీ.. అంద‌రికంటే హైలెట్ అయింది మాత్రం రాజ్ అర్జున్‌నే.


ఆయ‌న ఈ చిత్రంలో కరుడు గట్టిన నిజాం ప్రభువుగా, నిరంకుశవాదిగా కాసిం రజ్వీ పాత్ర‌లో క‌నిపించారు. రాజ్ అర్జున్ క‌న‌బ‌రిచిన న‌ట‌న.. ప‌లికిన హావ‌భావాలు.. డైలాగ్ డెలివ‌రీ విమ‌ర్శ‌క‌ల‌ను సైతం మెప్పించారు. కాసిం రజ్వీ క్యారెక్ట‌ర్ ను చూసి చాలా మంది ప్రేక్ష‌కులు రాజ్ అర్జున్ ను అస‌హించుకున్నారు. అంటే అంత అద్భుతంగా ఆయ‌న ఆ పాత్ర‌లో ఒదిగిపోయారు. అయితే రాజ్ అర్జున్ కు తెలుగులో ఇదే తొలి చిత్రం అనుకుంటే పొర‌పాటే. అంత‌క‌న్నా ముందు ఆయ‌న `డియ‌ర్ కామ్రేడ్‌` మూవీలో యాక్ట్ చేశారు.
ఎక్కువ‌గా హిందీ సినిమాల్లో రాజ్ అర్జున్ ప‌ని చేశారు. అడ‌పా త‌డ‌పా త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టించారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. రాజ్ అర్జున్ కూతురు ఇండ‌స్ట్రీలో తోపు హీరోయిన్‌. ఆమె మ‌రెవ‌రో కాదు సారా అర్జున్‌. ఈ అమ్మడు ప్రధానంగా తమిళ మరియు హిందీ సినిమాల్లో మ‌రియు వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సారా అర్జున్ సుప‌రిచితురాలే. 2010లో విక్ర‌మ్ హీరోగా ఎ.ఎల్. విజయ్ తెర‌కెక్కించిన `దైవ తిరుమగల్‌(తెలుగులో నాన్న‌)` సినిమాలో న‌చించిన చిన్నారి సారానే.


ఇక ఈ మ‌ధ్య మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`లో ఐశ్వ‌ర్య‌రాయ్ చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను పోషించి సారా మ‌రింత క్రేజ్ సంపాదించుకుంది. ఇర‌వై ఏళ్ల సారా హీరోయిన్ గా `ధురంధర్` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అయింది. ఇందులో బాలీవుడ్ స్టార్‌ రణవీర్ సింగ్ కు జోడిగా ఆమె క‌నిపించ‌బోతుంది. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన 2 నిమిషాల టీజర్ లో సారా మెయిన్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది.


మరింత సమాచారం తెలుసుకోండి: