పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో సలార్ 2 సినిమా కూడా ఉంది. కల్కి 2898 AD చిత్రంతో ఇటీవలే బారి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రాజా సాబ్ సినిమా షూటింగ్లో ఉన్న ప్రభాస్ అలాగే డైరెక్టర్ హనురాగవపూడి డైరెక్షన్లో ఫౌజి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తరువాతే సలార్ 2 సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ సలార్ 2 చిత్రానికి ప్రభాస్ కొంతమేరకు చాలా గ్యాప్ తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే కల్కి సీక్వెల్ కూడా ఉన్నది.


సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇక సీక్వెల్ పై ప్రభాస్ నుంచి ఎలాంటి స్పష్టమైన అప్డేట్ కూడా కనిపించకపోవడంతో అభిమానులు చాలా నిరాశతో ఉన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి డ్రాగన్ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పూర్తి అవ్వడానికి మరో ఏడాదిపైనే కావస్తోంది.ఈ చిత్రం అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్  వినిపిస్తున్నాయి. ఆ తర్వాతే సలార్ 2 సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


అందుకే ఈసారి సలార్ 2 సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఊహగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దిల్ రాజు రావణం అనే చిత్రాన్ని కూడా అల్లు అర్జున్ తో చేయబోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభాస్ నటిస్తున్న సలార్ 2 సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత కనిపించలేదు. కానీ ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. రాజా సాబ్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా తో కూడా స్పిరిట్ సినిమాని చేస్తున్నారు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: