- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

ఈ వారం తెలుగు చిత్రసీమలో భారీ హైప్ క్రియేట్ చేస్తోన్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ ఎపిక్ ఇప్పటికే టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. జూలై 24న వరల్డ్‌వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ సిద్ధమవుతుండటంతో ఈ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దర్శకులు క్రిష్ మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పీరియాడికల్ మూవీ కావడంతోనే, ఇది అభిమానుల్లోనే కాదు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ ఆసక్తిని రేపుతోంది. పవన్ ఇటీవల రాజకీయాల్లో బిజీగా ఉన్నా, ఈ సినిమా కోసం ఆయన చేసిన డెడికేషన్, ప‌వ‌న్ ఉప ముఖ్య‌మంత్రి అయ్యాక రిలీజ్ అవుతోన్న తొలి సినిమా కావ‌డం ఇవన్నీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.


ఈ నేపథ్యంలో, ఈ సినిమా నైజాం ఏరియా రిలీజ్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమా నైజాం రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ట్రేడ్ టాక్ ప్రకారం, ఈ రైట్స్‌ను మైత్రీ వాళ్లు దాదాపు రూ.35 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇది పవన్ కళ్యాణ్ మార్కెట్‌కు మరోసారి నిదర్శనం అంటున్నారు సినీ విశ్లేషకులు. మైత్రీ వాళ్లు నైజాంలో భారీగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మల్టీప్లెక్స్‌లు, సింగిల్‌ స్క్రీన్ థియేటర్లు అన్నీ కలిపి 300కి పైగా స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించ‌నున్నారు. సినిమాకు ఏ మాత్రం టాక్ బాగున్నా నైజాంలో ఫ‌స్ట్ డే దుమ్ము దులిపేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిధి అగర్వాల్ నటించగా, ప్రతినాయకుడిగా బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ పాత్ర కూడా విశేషంగా ఆకట్టుకునేలా ఉందని యూనిట్ చెబుతోంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం సంగీతం అందిస్తున్నారు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: