- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ లో కలిసి సినిమా చేస్తున్నప్పుడు హీరో , హీరోయిన్ చాలా క్లోజ్ గా ఉండటం . . . కలిసి డిన్నర్లకు వెళ్ళటం మాట్లాడుకోవడం సహజం. మరి సినిమా పూర్తి అయిన తర్వాత కూడా తరచూ కలుస్తూ ఉంటే ఏమనుకోవాలి. ప్రస్తుతం టాలీవుడ్లో యువజంట వ్యవహారం ఇలాగే ఉంది. వీరిద్దరూ కలిసి సినిమా చేశారు. ఆ టైంలోనే ఇద్దరు అనుబంధంపై గుసగుసలు మొదలయ్యాయి. తన సీను లేకపోయినా హీరో సీన్లు షూటింగ్ జరుగుతున్న సెట్ కి వెళ్ళేది హీరోయిన్. హీరో తో పాటు టైం గడిపేది. ఆ తర్వాత ఇద్దరు కలిసి షూటింగ్ పేరిట విదేశాలకు వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు గడిపారు. సినిమా షూటింగ్ పూర్తయింది. రిలీజ్ అయి అట్టర్ ప్లాప్ అయింది.


ఇవన్నీ అయిపోయిన ఆ జంట మాత్రం ఇప్పటికీ తరచూ కలుసుకుంటున్నారు. నేరుగా హీరో సెట్‌ కి వెళ్లకపోయినా ఖాళీ సమయాలలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అట. చూస్తుంటే టాలీవుడ్లో మరో యువప్రేమ జంట రెడీ అయినట్టే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్ళ ముద్దు ముచ్చట ఇప్పుడు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ లో హాట్‌ టాపిక్ గా మారింది. మ‌రి వీరిద్ద‌రు ప్రేమ తో ఆపేస్తారా ?  లేదా అంత‌కు మించి ముందుకు వెళ్లి పెళ్లి పీట‌లు కూడా ఎక్కేసి దంప‌తులు అవుతారా ? అన్న‌ది చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి. ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: