
ఇలాంటి సందర్భంలోనే హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఒక రాపిడ్ ఫైర్ లో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కొన్ని ప్రశ్నలు యాంకర్ వేయగా సమాధానాలు తెలియజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఆలియా భట్, కృతిసనన్, దీపికా పదుకొనే, కియారా అద్వానీలలో ఎవరంటే ఇష్టమని అడగగా పవన్ కళ్యాణ్ ఆలోచించకుండా కృతి సనన్ తెలిపారు. ఈ విషయం తెలిసి అభిమానులు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఇందిరాగాంధీ పాత్రలో కనిపించిన కంగనా రనౌత్ యాక్టింగ్ అన్న కూడా ఇష్టం అంటూ తెలిపారు పవన్ కళ్యాణ్.
ఇక మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ కు అలనాటి హీరోయిన్ శ్రీదేవి నటన అంటే చాలా ఇష్టమని తెలియజేశారు. అందుకు సంబంధించి తాజాగా కొన్ని వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే మొదటిసారి పవన్ కళ్యాణ్ ఇలాంటి విషయాలు అభిమానులతో పంచుకోవడంతో ఈ విషయాలను వైరల్ గా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ఓజి, ఉస్తాద్ సింగ్ వంటి చిత్రాలు ఉన్నాయి ఈ సినిమాల ను కూడా త్వరగా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.