సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల గురించి ఎప్పుడూ హాట్ హాట్ గాసిప్స్, ట్రెండింగ్ న్యూస్ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఈసారి మాత్రం అందరి దృష్టి మళ్లింది టాలెంటెడ్ బ్యూటీ, నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ వైపే. ఎందుకంటే చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతుందనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అభిమానులు కూడా ఈ వార్త విన్న వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు కీర్తి సురేష్ అనే పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి సినిమా ద్వారా ఆమె సాధించిన పేరు, గౌరవం, ప్రతిష్ట వేరే ఎవరూ సాధించని రీతిలో ఉన్నాయి. కేవలం టాలీవుడ్‌లో మాత్రమే కాదు, కోలీవుడ్‌లో కూడా తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నేచురల్ యాక్టింగ్, అందమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.


అయితే, బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తర్వాత మాత్రం ఈ బ్యూటీకి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. "కీర్తి బాలీవుడ్ ఇండస్ట్రీకి సూట్ కాదు" అనే అభిప్రాయం కొంతమంది అభిమానులు వ్యక్తం చేశారు. కానీ కీర్తి మాత్రం తన కెరీర్‌ను ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి బాలీవుడ్‌లో అవకాశాలు స్వీకరించింది. అయినప్పటికీ, ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు సైన్ చేయడంలో కొంత గ్యాప్ వచ్చింది. ఆమె ట్రాక్ రికార్డ్ చాలా బలంగా ఉన్నప్పటికీ, ఈ గ్యాప్ కారణంగా టాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులు సైన్ చేయలేకపోయింది అన్నది జనాల అభిప్రాయం. ఇక ఈ గ్యాప్ బ్రేక్ అయ్యేలా ఒక బిగ్ గుడ్ న్యూస్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. కీర్తి సురేష్‌కు తన కెరీర్‌లో కొత్త ఊపు ఇచ్చే సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నాడు ఆమెకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన నేచురల్ స్టార్ నాని అని ఫిలింనగర్ టాక్. నాని, కీర్తి సురేష్ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓ  ఇంటర్వ్యూల్లో ఒకరిపై ఒకరు చూపే స్నేహం గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్‌షిప్ కీర్తి కెరీర్‌కు ఒక పెద్ద బ్రేక్ ఇస్తుందట.



వైరల్ అవుతున్న టాక్ ప్రకారం, నాని త్వరలోనే ప్రతిభావంతుడైన దర్శకుడు శేఖర్ కముల దర్శకత్వంలో ఒక పెద్ద సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఫైనల్ చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు తెలుగు సినిమాల ఆఫర్స్‌ను రిజెక్ట్ చేసిన కీర్తి, ఈసారి మాత్రం ఒక్క క్షణం ఆలోచించకుండా వెంటనే అంగీకరించి సైన్ చేసిందట. ఇక ఈ వార్త నిజమైతే, తెలుగు అభిమానులకు ఇది డబుల్ హ్యాపీ న్యూస్ అనమాట. ఎందుకంటే, చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ ఒక బిగ్ ప్రాజెక్ట్‌లో కనిపించబోతుండటమే కాకుండా, తనకు సూపర్ స్టార్ ఇమేజ్ ఇచ్చిన టాలీవుడ్‌లో తిరిగి పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతుందనే సంకేతాలివ్వడం అందరికీ ఎక్సైటింగ్ న్యూస్. ఫిలింనగర్ వర్గాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ కీర్తి సురేష్ కెరీర్‌లో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. అభిమానులు సోషల్ మీడియాలో "మళ్లీ మా కీర్తి గ్లామర్, యాక్టింగ్‌తో మంత్ర ముగ్ధులను చేస్తుంది", "తెలుగు తెరపై కీర్తి రీ-ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతోంది" అంటూ హ్యాష్‌ట్యాగ్స్‌తో ఫుల్ హ్యాపీగా ట్రెండ్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి, చాలా కాలం తర్వాత కీర్తి సురేష్ నిజంగా గుడ్ న్యూస్ చెప్పబోతుందనే ఈ వార్త అభిమానుల హృదయాల్లో పండగ వాతావరణం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: