టాలీవుడ్ ,కోలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రాధిక శరత్ కుమార్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది హీరోలతో నటించిన రాధిక ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఈమె క్రేజ్ భారీగా ఉండేది.. ఇప్పటికీ ఎన్నో చిత్రాలలో నటిస్తూ మరొకవైపు సీరియల్స్లలో కూడా నటిస్తూ బాగానే పేరు సంపాదించింది. తాజాగా రాధిక శరత్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రాధిక తల్లి గీత నిన్నటి రోజున రాత్రి మరణించినట్లుగా తెలుస్తోంది. ఈమె వయసు ప్రస్తుతం 86 సంవత్సరాలు..గత కొద్దిరోజులుగా వృద్ధాప్య సమస్యలతో రాధిక తల్లి గీత ఇబ్బందులు పడుతూ నిన్నటి రోజున తుది శ్వాస విడిచింది.



ఇమే దివంగత సీనియర్ నటుడు ప్రముఖ రాజకీయవేత్త ఎం.ఆర్.రాధా భార్య కావడం చేత అటు తమిళ సినీ సెలబ్రిటీలే కాకుండా, ప్రముఖ రాజకీయ నేతలు కూడా ఆమెకు నివాళులు తెలుపుతున్నారు. అలాగే ఒకప్పుడు హీరోయిన్గా ఎన్నో చిత్రాలతో నటించిన నిరోషాకి కూడా ఈమె తల్లి. తల్లి మరణంతో అటు రాధిక ,నిరోషా కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. రాధిక తల్లి గీత అంత్యక్రియలు ఈ రోజున సాయంత్రం 4:30 నిమిషాలకు చెన్నైలోని బెసెంట్ నగర స్మశాన వాటికలో జరగబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇందుకు సంబంధించి రాధిక తన తల్లితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంది.



రాధిక శరత్ కుమార్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు పొలిటికల్ పరంగా కూడా యాక్టివ్గానే ఉన్నది. చివరిగా 2024లో ఆపరేషన్ రావన్ అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి సినిమాలలో నటించలేదు రాధిక ప్రస్తుతమైతే సీరియల్స్లలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన అభిమానులు కూడా రాధికను ధైర్యంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: