
ఈ ట్రోలింగ్ బ్యాచ్ పవన్ కళ్యాణ్ సినిమా రాగానే ఆయన సినిమాల మీద కక్కుర్తి చూపకుండా, ఆయన వ్యక్తిగత జీవితాన్ని లాగి బయటకు తీసి ట్రోల్స్ చేస్తుంది. ఆయన మూడు పెళ్లిళ్లు, ఆయన కుటుంబ జీవితం, ఆయన వ్యక్తిగత నిర్ణయాలు—ఇవి అన్నింటినీ టాపిక్ చేసుకుని సోషల్ మీడియాలో ఘాటు ఘాటుగా వైరల్ చేస్తూ, పవన్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కి శత్రువులు మరింత పెరిగిపోయారు. అప్పటివరకు "పవన్ అన్న" అంటూ పిలిచినవాళ్లే, తర్వాత కాలంలో "వాడా..? పవన్" అంటూ ఏకవచనంలో దూషించే స్థాయికి దిగజారిపోయారు.
అదే సమయంలో, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో ఈ ట్రోలింగ్ బ్యాచ్ సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేసింది. “ఏపీ డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి సినిమాలు ఎలా చేస్తాడు?”, “ముఖానికి రంగులు పూసుకునే నటన వదిలి రాజకీయాల మీద దృష్టి పెట్టాలి” అంటూ కఠినంగా విమర్శలు చేశారు. అప్పట్లో నెగిటివ్ పోస్ట్‌లు విపరీతంగా వైరల్ అయ్యాయి. సినిమా రిలీజ్ కాకముందే "పవన్ సినిమాలను అడ్డుకుంటాం", "రిలీజ్ ఆపేస్తాం" అంటూ కొంతమంది బహిరంగంగానే ప్రకటించారు.
అయితే ఇదే బ్యాచ్, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విషయంలో మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. సాధారణంగా వీళ్ళు ప్రతి పవన్ సినిమా విషయంలో ఒక హంగామా చేయడం మామూలే. కానీ ఓజీ విషయానికి రాగానే ఎక్కడా పెద్దగా ట్రోలింగ్ వినిపించలేదు. “భజన బ్యాచ్” అని పిలిచే ఈ గుంపు ఎందుకు ఒక్కసారిగా మాయమైందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల టాక్ ప్రకారం—పవన్ కళ్యాణ్ ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత ఈ బ్యాచ్ ఒక్కసారిగా భయపడిపోయిందట. ఎందుకంటే, ఆ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ కి వచ్చిన రెస్పాన్స్, అక్కడి ప్రజల క్రేజ్ చూసిన తర్వాత "ఈ సినిమాకి ఎంత చేసినా హిట్ అవుతుంది, మనం అడ్డుకోవడం అనవసరం" అని తేల్చుకున్నారని అంటున్నారు. అందుకే సోషల్ మీడియాలో నెగిటివ్ హంగామా చేయకుండా, గప్ చుప్‌గా పక్కన కూర్చునిపోయారు.
ప్రస్తుతం ఈ టాపిక్ ఫిలిం సర్కిల్స్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. అభిమానులు కూడా “దట్ ఈజ్ పవన్ కళ్యాణ్” అంటూ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. అసలు ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా, పవన్ కళ్యాణ్ పేరు మీద వచ్చే పాజిటివ్ వేవ్, ఆయనకి ఉన్న అభిమానుల శక్తి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది అని ఈ సంఘటన మరోసారి ప్రూవ్ చేసింది.