యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. ముఖ్యంగా బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా విశిష్టత దక్కించుకుంది. అయితే బాహుబలి సినిమా క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి ‘సాహో’ సినిమా నిర్మాతలు ఈ సినిమా ఆగస్టు 30వ తారీఖున రికార్డు స్థాయిలో విడుదల చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కి ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.


ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీ లో ఈ సినిమాకి అనుకున్నంత కలెక్షన్లు కూడా రాలేకపోయాయి. దీంతో సౌత్ ఇండస్ట్రీ లో సినిమా కొన్న బయ్యర్లు చాలావరకు నష్టపోయారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సాహో సినిమాకి మంచి టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ చిత్రం దాదాపు 40 కోట్ల వరకూ నష్టాలను చవిచూసిన, కొన్ని చోట్ల మాత్రం కలెక్షన్ల మోత మోగించి రికార్డ్స్ బ్రేక్ చేసింది.


నెల్లూర్ జిల్లాలో సాహో 16వ రోజున 1,85,796 రూపాయల షేర్ సాధించిన సాహో మొత్తం మీద 4,30,50,033 రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసి బాహుబలి 1 పేరిట ఉన్న 4.30 కోట్ల షేర్ ను దాటేసింది. అయితే ఇప్పటికి ఇంకా బాహుబలి 2 సినిమానే నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతుంది. అయితే సాహో ఇప్పటికే ఫైనల్ రన్స్‌కి చేరుకోవడంతో ఆ రికార్డ్‌ను చెరిపేస్తుందా లేదా అనేదే కాస్త అనుమానంగా కనిపిస్తుంది. మొత్తానికి ప్రభాస్ గతంలో తాను క్రియేట్ చేసిన రికార్డులను తానే పగలగొట్టడం హైలెట్ అని చెప్పవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: