ప్రతి జనరేషన్లో మనుషుల ఆలోచన విధానం పూర్తిగా మారిపోతూ ఉంటుంది అని ఎంతో మంది నిపుణులు చెబుతూ ఉంటారు. 90లలో పుట్టిన వాళ్ళు ఇక 20 లలో పుట్టిన వాళ్లను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి రోజుల్లో పిల్లలు ఎంత షార్ప్ గా ఉన్నారో మాటల్లో వర్ణించడం కూడా చాలా కష్టమే. ఆడుకునే వయస్సు నుంచే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు.


 బుడిబుడి అడుగులు వేస్తూ తల్లిదండ్రి చేత పట్టుకుని నడిచే సమయంలోనే ఏకంగా ప్రపంచ రికార్డులు కూడా సృష్టిస్తూ ఉండడం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. మనం లోకం తీరు తెలియక కోటి స్నేహితులతో ఎంతో అమాయకంగా ఆడుకున్న సమయంలో ఇప్పటి పిల్లలు మాత్రం లోకాన్ని మొత్తం శాసించే స్థాయికి ఎదుగుతూ ఉన్నారు. ఇలా ఎవరైనా పిల్లలు అరుదైన ఘనత సాధించారు అంటే ఇక వారి గురించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక నాలుగేళ్లు చిన్నారి ఏకంగా చాలామందికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డు సృష్టించింది.


 ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలలో ఎవరెస్ట్ ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎవరెస్టు ఎక్కాలి అంటే దృఢమైన సంకల్పం ఉండాలి. ఇప్పటివరకు ఎంతోమంది ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించి విఫలమైన వారు ఉన్నారు. కానీ చెక్ రిపబ్లిక్ కు చెందిన జారా అనే నాలుగేళ్ల బాలిక.. ఆడుకునే వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంపు ఎక్కేసింది. దీంతో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు భారత్కు చెందిన పృష లోకేష్ (5 ) పేరిట ఉండేది. ఇటీవల జార తన తండ్రి ఏడేళ్ల సోదరుడుతో కలిసి ఎవరెస్టు బేస్ క్యాంపుకు చేరుకుంది. జారాకు చిన్నప్పటి నుంచి నడవడం ఇష్టమని.. రోజుకు ఐదు నుంచి పది కిలోమీటర్లు చేరుకుంది అంటూ ఆమె తండ్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: