భారత దేశంలో స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలు అక్రమాలపై ఎంతో మంది గళం విప్పుతున్నారు. రోజూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకు రావాలని మహిళా సంఘాలు ప్రతిరోజు మొరపెట్టుకుంటూనే ఉన్నాయి. ఇక దేశ రాజధాని అంటే ఎంతో సెక్యూరిటీతో ఉంటుందని భావిస్తారు..కానీ ఇప్పటివరకు మహిళలపై అత్యంత కృరంగా అత్యాచారాలు చేసింది అక్కడే అని ముక్కున వేలు వేసుకుంటారు. ఢిల్లీ నడిబొడ్డున నిర్భయ లాంటి ఘటనలు జరిగినా అక్కడి పోలీసు వ్యవస్త రోజు రోజు పెరిగిపోతున్న అత్యాచారాల పర్వాన్ని కంట్రోల్ చేయలేక పోతుంది. తాజాగా మరో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు.

ఓ మహిళా జర్నలిస్టు పట్ల ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించి, వేధించాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.. నోయిడా సెక్టార్ మెట్రో స్టేషన్ సమీపంలో క్యాబ్ డ్రైవర్ రవీందర్ సింగ్ రాంగ్ రూట్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళా జర్నలిస్టు వెంటనే కారును ఆపించి దిగేసింది.  దీంతో ఆ డ్రైవర్ ఆమెను వెంబడించి అసభ్యంగా ప్రవర్తించాడు..గతంలో ఇలాగే వెంబడించి మహిళలను అత్యాచారం చేసిన ఘటనలు గుర్తు చేసుకొని బాధితురాలు వెంటనే పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.

గతంలో ఉబేర్ క్యాబ్ డ్రైవర్ అరెస్టు చేసిన దృశ్యం


పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు.  దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల క్రితం ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేయగా, తాజాగా ఉబెర్ సంస్థకే చెందిన మరో డ్రైవర్ ఓ మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: