ప్రపంచంలో క్రికెట్ అంటే ఎంతగా అభిమానిస్తారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడుతుంటారు..ప్రపంచలో మారు మూల గ్రామాల్లో సైతం క్రికెట్ ఆటకు ఎంతో ప్రాచర్యం వచ్చింది.  తాజాగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్రికెట్ బ్యాట్ పట్టారు. ఇటీవల జరిగిన ఒక ఈ-స్పోర్ట్ ప్రాడక్ట్ లాంచింగ్ కార్యక్రమానికి కోవింద్ తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు హాజరయ్యారు.
Image result for రాష్ట్రపతి కోవింద్
ఈ ప్రాడక్ట్ (ఐబీ క్రికెట్) ద్వారా వర్చువల్ రియాల్టీలో క్రికెట్ ఆడే వీలుంది.  ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ బ్యాట్‌ను చేతబట్టి విర్చువల్ టెక్నాలజీ ద్వారా క్రికెట్ ఆడారు. ఈ ఫోటోను భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విర్చువల్ రియాల్టీ గీర్‌‌ను కళ్లకు కట్టుకుని బ్యాట్ చేస్తున్నారు.
Image result for cricket
కోవింద్ తో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగి సహా పలువురు నవ్వులు చిందిస్తుండగా... వీఆర్ గేర్ ను ధరించి క్రికెట్ ఆడారు రాష్ట్రపతి. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: