తెలంగాణలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ ఏ అవకాశాన్ని కూడా వదులుకునే అవకాశం కనపడటం లేదు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లలేకపోతున్నారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయినా సరే ఈ విషయాన్ని బలంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లి బిజెపిని ఇబ్బంది పెట్టలేకపోతున్నారు.

బడ్జెట్ ప్రవేశ పెట్టి మూడు రోజులు అయినా సరే టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు గానీ నియోజకవర్గాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం లేదు. వెనకబడిన జిల్లాలకు చెందిన వాళ్లు కూడా పెద్దగా మీడియాతో మాట్లాడకపోవటంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిణామాల నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళుతున్న తరుణంలో కూడా భారతీయ జనతా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టలేకపోతున్నారు.

మరి ఈ విషయంలో ఎలాంటి అడుగుపడుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే బిజెపి ని ఇబ్బంది పెట్టే విషయంలో ముందు నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వెనుకబడి ఉన్నారు. చివరకు తమ తమ జిల్లాలలో కూడా నిధులు రాకపోయినా సరే వాళ్ళు మాట్లాడటం లేదు. కీలక ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా... తెలంగాణకు భవిష్యత్తుగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా బడ్జెట్లో అన్యాయం జరుగుతున్నా సరే వాళ్ళు మాత్రం మాట్లాడక పోవడం గమనార్హం. మరి భవిష్యత్తులో బీజేపీ నేతలు నియోజకవర్గాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినా సరే మంత్రులు ఎమ్మెల్యేలు ఇదేవిధంగా ఉంటారా అనే ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: