తిరుపతిలో అధికార పార్టీపై టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రౌడీయిజం పతాకస్థాయికి చేరింది అని ఆయన  ఆరోపించారు. టిటిడి ఛైర్మన్ గా పనిచేసిన వ్యక్తికి దేవుడంటే నమ్మకం, భయం లేదు అని టిడిపి అధికార ప్రతినిధి పట్టా  ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేయించింది తిరుపతి ఎమ్మెల్యేనే అని ఆయన మండిపడ్డారు. ఏకగ్రీవాల కోసం ఇంత దిగజారుడుకు దిగుతారా..? అని నిలదీశారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి ఏజెంట్ లేకుండా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

రిగ్గింగ్ కు వైసిపి నేతలు ప్లాన్ వేశారు అని ఆయన మండిపడ్డారు. తిరుపతి నగరంలో జరిగే ఎన్నికలకు కేంద్ర బలగాలను తీసుకురావాలి అని ఆయన డిమాండ్ చేసారు. తిరుపతి ఎన్నిక ప్రశాంతంగా జరగాలంటే ఎమ్మెల్యే భూమనను హౌస్ అరెస్ట్ చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. ఈరోజు నుంచే కరుణాకర్ రెడ్డి కదలికలపై పోలీసులు దృష్టి పెట్టాలి అని ఆయన కోరారు. చంద్రబాబు పర్యటనలో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది అని అన్నారు. కర్నూలులో జనం టిడిపి అధినేతకు నీరాజనాలు పలికారు అని ఆయన వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని పట్టాభి వ్యాఖ్యానించారు. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కార్పొరేషన్ ఎన్నికలలో పోటీలో ఉన్న టిడిపి 21 అభ్యర్థులకు ఏమి జరిగినా కరుణాకరరెడ్డే  పూర్తి  బాద్యత వహించాలి అని సుగుణమ్మ  డిమాండ్ చేసారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని టిడిపి కోరుకుంటోంది అని సుగుణమ్మ  పేర్కొన్నారు. దానికి ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి సహకరించాలి అని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ   విజ్ఞప్తి చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: