న‌టుడు ఎస్వీబీసీ మాజీ  చైర్మెన్ థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీరాజ్ తాజాగా ఓ ఇంట‌ర్యూలో ఆస‌క్తిక‌ర వ్యాక్యలు చేశారు. తాను వైసీపీకి హార్డ్ కోర్ టెర్ర‌రిస్ట్ అని చివ‌రివ‌ర‌కూ వైసీపీలోనే కొనసాగుతాన‌ని చెప్పారు. ఈ సంధ‌ర్భంగా ర‌ఘురామ కృష్ణం రాజు సొంత పార్టీపైనే విమ‌ర్ష‌లు చేస్తున్నార‌ని ఆయ‌నపై మీ అభిప్రాయం ఏంట‌ని ప్ర‌శ్నించ‌గా..అస‌లు ర‌ఘురామ ఎవ‌రో నాకు తెలియ‌దంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ త‌ర‌వాత అత‌డి గురించి మా పార్టీ పెద్ద‌లు చూసుకుంటార‌ని పృధ్వీ చెప్పారు. ఇక ఈ ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్, చంద్ర‌బాబు పై మాత్రం సానుకూలంగా స్పందించారు. ప్ర‌తిసారి నా ముఖం పై మైక్ పెట్టి చంద్ర‌బాబు గురించి మాట్లాడమంటున్నారు. నేను చంద్ర‌బాబు గురించి మాట్లాడ‌ను. ఆయ‌న రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయ‌న ఓ పార్టీ అధినేత గుంటూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం లో పాల్గొంటే మీకెందుకు దూల అంటూ ప్ర‌శ్నించారు. 

ఆయ‌న ఓ పార్టీకి అద్య‌క్షుడ‌ని త‌న‌కు న‌చ్చిన చోట ప్ర‌చారం చేసుకునే హ‌క్కు ఉంద‌ని అన్నారు.  అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు చేస్తూ రాజ‌కీయాలు చేయ‌డం స‌రైన నిర్ణ‌య‌మేన‌ని అన్నారు. సినిమాలు ఆయ‌న వృత్తి అని క్రికెట‌ర్ లు ఐపీఎల్ ఆడి మ‌ళ్లీ దేశం కోసం ఎలా ఒక్క‌టై ఆడ‌తారో సినిమాలు రాజ‌కీయాలు కూడా అంతే అనుకుంటూ పొంత‌న లేని స‌మాధానం ఇచ్చారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధాంతం ప్ర‌జ‌ల‌కు మేలు చేయ‌డ‌మేన‌ని..పేద ప్ర‌జ‌లు వారి అభివృద్ది ..సంక్షేమ ప‌థ‌కాలు వీటి గురించే ఆలోచిస్తార‌ని అన్నారు. అంతే కాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌జ‌ల గురించే ఆలోచిస్తార‌ని అన్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం భాగా చేశామ‌ని చెప్పుకుంటారని తెలిపారు. ఇక లోకేష్ గురించి అడ‌గ్గా పృధ్వీరాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లోకేష్ లో పెద్ద‌గా మార్పేమీ క‌నించ‌డంలేద‌ని అన్నారు. కాస్త సైజ్ త‌గ్గాడు తప్పితే ఆయ‌న మాట తీరు అలాగే ఉంద‌ని వ్యాఖ్యానించారు. లోకేష్ ప్ర‌భుత్వానికి స‌రైన సూచ‌న‌లు స‌ల‌హాలు ఇవ్వాలిగాని ఊరికే విమ‌ర్శ‌లు చేస్తార‌ని పృధ్వీ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: