పోయిన చోటే వెతుక్కోవ‌డం
పొందిన చోట నిల‌దొక్కుకోవ‌డం
ఈ రెండూ రాజ‌కీయాల్లో కీల‌కం
అవ‌స‌రం కూడా..

ఢిల్లీ రాజ‌కీయాల్లో రేపు మార‌నున్న
ప‌రిణామాలు కూడా చెప్పేదిదే!
సోనియా - రాహుల్
జ‌గ‌న్ - ష‌ర్మిల - త్వ‌ర‌లో భేటీ కానుండ‌డం
ఓ విధంగా జ‌రిగేందుకు ఆస్కారం ఉన్న ప‌రిణామం




రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌రువాత ఆ కుటుంబంతో న‌డుచుకున్న విధానం బాగాలేని కార‌ణంగానే కాంగ్రెస్ ఏపీలో చ‌చ్చిపోయింది. ఇది వాస్తవం. ఈ విధంగా అనేందుకు ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయి. ఇక తెలంగాణ ఇచ్చాక తామే ఇచ్చామ‌న్న మాట‌ను ప్రజ‌ల్లోకి తీ సుకు పోలేని నాయ‌కులు ఉన్న కార‌ణంగా ఇక్క‌డా ఓడిపోయింది. ఇది కూడా ఒప్పుకోద‌గ్గ నిజం. ఈ ద‌శ‌లో జ‌గ‌న్ పాత మైత్రికి స న్నాహాలు చేస్తుండ‌డం విశేషం. కేసుల పేరిట జైలూ, బెయిలూ పేరిట నానా అవ‌స్థ‌లూ పెట్టినా కాంగ్రెస్ ద‌గ్గ‌ర త‌మ మాట చెల్లుతుం దన్న న‌మ్మ‌కం ఒక‌టి జ‌గ‌న్ కు ఉంది. అదే బీజేపీలో ఇప్పుడు వీరి మాట‌కు అస్స‌లు విలువ లేదు. దీంతో బీజేపీని కాద‌ని అన్నా చెల్లెళ్లు ఇద్ద‌రూ ఒక‌నాటి స్నేహాల‌ను కోరుకుంటున్నారు అని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ టాక్.





రేవంత్ కూడా రెడ్డి సామాజిక వ‌ర్గంకు చెందిన నేతే కావ‌డం, ష‌ర్మిల‌కూ, రేవంత్ కూ ఇంకా కాంగ్రెస్ నేత‌ల‌కు ఉమ్మ‌డి శ‌త్రువు కే సీఆరే కావ‌డంతో ఇప్ప‌టికిప్పుడు పాత బంధాల పునరుద్ధ‌ర‌ణ సాధ్యం కాక‌పోయినా ఏనాటికైనా ఈ సూత్రం ఒక‌టి అమ‌లుకు నోచుకోవ‌ డం త‌థ్యం. అదే సాధ్యం కూడా! అక్ర‌మ కేసులు అని సోనియా కొన్ని పేర్లూ, కొన్ని అభియోగాలూ తెర‌పైకి తెచ్చారు. గు ర్తుంది క‌దా! అదే కోవ‌లో చాలారోజులు చాలా కేసులు న‌డిచాయి. ఈడీ, సీబీఐ, సీఐడీ వంటి అత్యున్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌లే కాదు ఇండియా టుడే లాంటి మీడియాల‌నూ త‌మ‌కు అనుగుణంగా వాడుకుని సోనియా త‌న‌దే పై చేయి అనిపించుకున్నారు ఆ రోజు జ‌గ‌న్ విష‌య‌మై..! దీంతో జ‌గ‌న్ అండ్ కో తీవ్ర ఇబ్బందులు చ‌వి చూసింది. ఈ కేసుల‌లో భాగంగా జ‌గ‌న్ కు చెందిన కీల‌కమ‌యిన ఆస్తుల‌నూ, బ్యాంకు అకౌంట్ల‌నూ ఈడీ అటాచ్ చేసింది. ఆ త‌రువాత ప‌రిణామాలలో భాగంగా బీజేపీ సీన్ లోకి వ‌చ్చింది. కొంద‌రు బీజేపీ పెద్ద‌ల చొరవ ఫ‌లించి ఈడీ కేసుల‌లో వేగం త‌గ్గింది. ఆస్తుల‌ను కూడా డిటాచ్ చేశారు సంబంధిత అధికారులు. అదేవిధంగా అకౌం ట్ల‌ను కూడా అన్ బ్లాక్ చేశారు. దీంతో మొన్న‌టి ఎన్నిక‌ల్లో వైసీపీ - బీజేపీ బంధం బ‌ల‌ప‌డి, ఏదో ఒక రీతిన అనుకున్నవి ధంగా కాదు..కాదు..అనుకోని విధంగా అనూహ్య రీతిలో జ‌గ‌న్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రావ‌డంతో ప‌రిస్థితులు చ‌క్క‌దిద్దుకు న్నాయి.మరోవైపు చంద్ర‌బాబు నాయుడు సైతం పాత స్నేహం పున‌రుద్ధ‌ర‌ణ‌లో ఉన్నారు. అదేవిధంగా తాను ఎప్ప‌టి నుంచో ఆశిస్తున్న కూట‌మి నిర్మాణంలోనూ ఉన్నారు. థ‌ర్డ్ ఫ్రంట్ ను నెల‌కొల్పే యోచ‌న కూడా ఆయ‌న‌కు ఉంది. ఆయ‌న‌తో పాటు కేసీఆర్ కూడా ఢిల్లీ  రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో చూస్తున్నారు. కానీ ఆయ‌న‌కు తెలంగాణ ప‌రిణామాల‌తోనే కాలం స‌రి పోతుండ‌డంతో ఫోక‌స్ హ‌స్తిన‌పురి రాజ‌కీయాల‌పై పెట్ట‌డం లేదు.




ఢిల్లీ ప‌రిణామాల‌ను చూస్తున్న ఎంపీలు కూడా పెద్ద‌గా యాక్టివ్ గా లేరు. అప్ప‌ట్లో క‌విత ఉండేవారు కానీ ఆమె ఓట‌మి త‌రువాత సంతోష్ తో స‌హా ఇంకొంద‌రు ఢిల్లీ రాజ‌కీయాల్లో ఉన్న‌ప్ప‌టికీ దేశంలో అత్యున్న‌త శ‌క్తిగా భావించే జాతీయ పార్టీల‌కు చేరువ కాలేక పో యారు. కొన్ని ప్రాంతీయ పార్టీల‌తో స్నేహం కూడా పెద్ద‌గా చేయ‌లేక‌పోయారు. దాంతో టీఆర్ ఎస్ కూడా పాత స్నేహాల పునరు ద్ధ‌ర‌ణ‌కే ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే క్ర‌మంలో జ‌గ‌న్, ష‌ర్మిల కూడా ఢిల్లీ రాజ‌కీయాల‌పై ప్రేమ పెంచుకుంటున్నారు కొన్ని ప్రాంతీయ పార్టీల‌తో అప్ప‌ట్లో కాస్త అనుబంధం ఉన్న‌ప్పటికీ ఇప్పుడు ఆ బంధాలేవీ లేవు వైసీపీకి. ఈ త‌రుణాన కాంగ్రెస్ కు చేరువ అయ్యేందుకు లేదా ద‌గ్గ‌ర అయ్యేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని టాక్ . కాంగ్రెస్ కూడా ఇందుకు సుముఖంగా ఉంది. తమ‌ను కాద‌నుకుని వెళ్లిన జ‌గ‌న్ అనేక విజ‌యాలు సాధించ‌డం, ఆంధ్రాలో తిరుగులేని నేత రాణించ‌డం అ న్నవి కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల మెప్పున‌కు  కార‌ణం. ఈ క్ర‌మంలోనే కొత్త కూట‌మి ఏర్పాటు కానీ లేదా కాంగ్రెస్ తో దోస్తీకి కా నీ జ‌గ‌న్, ష‌ర్మిల ప్రాధాన్యం ఇవ్వ‌వొ చ్చు. ఏమో గుర్రం ఎగ‌రావచ్చు. ష‌ర్మిల ఢిల్లీ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌నూవ‌చ్చు. ఆశిస్తే మిధున్  సెంట్ర‌ల్ మి నిస్ట‌ర్ కానూవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: