సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. దేశంలో న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీజేఐ ఎన్వీ రమణ ఎంతగానో కృషి చేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్ల నియామకాల్లో 90 శాతం మన కార్యకర్తలకు ఇచ్చాము అని మా జాతీయ కార్యదర్శి vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి చెప్పారు అని వాలంటరీ లకు 5 వేలు జీతం అన్నారు..అందులో 1000 రూపాయలు కట్టింగ్ అన్నారు ఎందుకో తెలియదు అని ఆయన ప్రశ్నించారు.

 ప్రజలకు ఉద్యోగాలు లేవు అని మా ఎమ్మెల్యే కేతిరెడ్డి 264 మంది వాలంటీర్స్ ను తొలగించారు అని అసహనం వ్యక్తం చేసారు.  విదేశాలకు వెళ్లేందుకు విజయసాయిరెడ్డి కి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది  అన్నారు ఆయన. సెప్టెంబర్ 22 వతేదీన విజయసాయిరెడ్డి ఈడీ ఛార్జ్ షీట్ లో సీబీఐ కోర్టుకు హాజరుకావాలి అని ఏర్కొన్నారు. నేను వేసిన బెయిల్ రద్దు కేసు సెప్టెంబర్ 14న వస్తుంది ఆలోగా ఆయన విదేశాలకు వెళ్తే బెయిల్ రద్దు అయ్యి అరెస్ట్ చేయాల్సి వస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఏదో పూచీకత్తు పై బాండ్లు ఇచ్చి వెళ్తున్నారు అని తెలిసింది అన్నారు.

నన్ను విదేశాలకు వెళ్తున్నారు అని ప్రచారం చేసి  విజయ సాయి రెడ్డి ఇప్పుడు వెళ్తున్నారు అని ఆయన లోపల అనుకునేది ఇతరులకు ఆపాదించారు విజయ సాయి రెడ్డి అని విమర్శించారు. కేంద్ర రైల్వే సర్వీసుల నుండి రాష్ట్రానికి వచ్చిన సత్యనారాయణ  పీడీ అకౌంట్లు ద్వారా అవకతవకలు కు పాల్పడ్డారని వార్తలు వస్తున్నాయి అని 2 లక్షల అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిల్లో వచ్చిన డబ్బులను వేరే ఖాతాలకు బదిలీ చేశారు అని విమర్శలు చేసారు. పారిశ్రామిక విధ్వంస కాండను జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రానికి కుడా వ్యాపింప చేస్తున్నారు అన్నారు. తమిళనాడు లో నాకున్న పవర్ ప్లాంట్ కు కూడా అక్కడ అధికారం లో  ఉన్న వారితో సంబంధాలను ఉపయోగించి ఇబ్బందులు కలుగ చేస్తున్నారు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: