రాజకీయం అంటేనే నాయకులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోడం చూస్తూనే ఉంటాం. ప్రతిపక్షాలు అనగానే ఆరోపణలు సహజమే. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రతిపక్ష నాయకులు రియాక్ట్ అవుతున్న తీరు వారి జోరు మామూలుగా లేదు. పోసాని కృష్ణ మురళి అయితే పవన్ ను నేరుగా మీరు పూనమ్ కి కడుపు చేసి వదిలేశారు. మరి మీలాంటి వారు మహిళలకు న్యాయం చేస్తాము, అభివృద్ధి చేస్తాము అనడంలో అర్దం లేదు అని ఏకిపారేశారు.  అది ఎంతగా వైరల్ అయ్యింది అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా పోసాని చేసిన ఆరోపణకు వ్యతిరేకంగా పవన్ ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్న సందర్భంలో... ఈ అంశంపై స్పందించారు బిజెపి నాయకురాలు శ్వేత రెడ్డి. ఆమె పోసాని కి మద్దతు పలుకుతూ జనసేన అధినేత పవన్ పై నిప్పులు కురిపించారు. ఆమె ఏమన్నారంటే పోసాని కృష్ణ మురళి గారు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని భయంకరమైన వాస్తవాలను బయట పెట్టారు. 

అదే విషయం తెలంగాణలో హైదరాబాద్ గడ్డ మీద ఇపుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకు న్యాయం చేస్తారు, ఆడపిల్లలను రక్షించాలి, మహిళా సాధికారత అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. మరి ఆ స్పృహ ఆయనకే లేకుండా పోవడం ఆశ్చర్యకరం. పూనమ్ కౌర్ ని పెళ్లి  చేసుకుంటాను అని చెప్పి నమ్మించి కడుపు చేసి... మళ్ళీ అబార్షన్ చేసి  డబ్బులు ఇచ్చి సెటిల్ చేశారు. దాని గురించి మీరు సమాధానం చెప్పండి అని ప్రశ్నించారు.  అలా ప్రశ్నించడం తప్పా అందుకు ప్రజలు అండగా నిలవాలి. కానీ కొందరు పీకే ఫ్యాన్స్ అంటూ ఓ అని పైన పడిపోతున్నారు? తప్పని ప్రశ్నించడం  తప్ప అంటూ సున్నితంగానే ఫైర్ అయ్యారు శ్వేత రెడ్డి. ఎవరైనా సరే తప్పు చేస్తే సమాధానం చెప్పాలి.. తప్పు చేస్తే ప్రశ్నించాలి.  

పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే.  ఆమె త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇదే విషయం చర్చించగా ఆ ఆడియో గతంలో బయటకు వచ్చింది. అందులో ఆమె త్రివిక్రమ్ తో ఏమన్నారు  అంటే. పవన్ గారు మహిళల భద్రత గురించి ఇలా మాట్లాడుతున్నారు. వెర్ హీ ఈస్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఫైవ్ స్టార్ హోటల్స్ దెన్ వాట్ ఇస్ ది జస్టిస్ దట్ హ్యాజ్ బీన్ డన్ టు మీ. నేను పవన్ గారి క్షేమం గురించి నేను ఇంత ఆలోచిస్తే నన్ను ఒక డాష్ గా చూపిస్తున్నారు టీవీ చానల్స్ లో అంటూ  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాట్లాడుతూ బాధపడింది పూనమ్. మరి ఆమె ఆడపిల్ల కదా అది అన్యాయం కదా అంటూ ప్రశ్నించారు శ్వేత రెడ్డి. అంతేకాదు ఆయన గురించి నిజాలు మాట్లాడితే ఇలా పైన పడిపోతున్నారు. 

ఒకవేళ ఇదే నష్టం మీ చెల్లికి మీ అక్కకు మీ పాపకు జరిగి ఉంటే ఇలాగే సపోర్ట్ చేస్తారా లేక గల్లా పట్టుకొని అడుగుతారా? లేదా ఫ్యాన్ అని అన్ని ముస్కొని కూర్చుంటారా అని కడిగేసింది. ఒక్కసారి ఆలోచించండి జనసేన సైనికులు నిజంగా మీరు చదువుకున్న వారు అయితే, సమాజంలో ఏం జరుగుతుందో మాకు అవగాహన ఉంది అని నిజంగా మీరు బాధ్యతాయుతమైన కుటుంబంలో జన్మించి వుంటే బాధ్యతాయుత ప్రవర్తన మీకు ఉంటే...ఇలా చేస్తారా ఆలోచించండి ఎలా రియాక్ట్ అవ్వాలి అలాగే రియాక్ట్ అవ్వండి.. అంతేకాని ఫ్యాన్ కాబట్టి ఆయన వైపు మాట్లాడడం కాదు అన్నారు. దీనిపై పవన్ కానీ పవన్ ఫ్యాన్స్ కానీ ఈ విధంగా స్పందిస్తారో చూడాలి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ కు రాజకీయంగా చెడుగా చిత్రీకరించనున్నాయా? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: