బొత్స సత్యనారాయణ....రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కరలేని పేరు...దశాబ్దాల పాటు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌లో పనిచేసిన బొత్స గురించి అందరికీ తెలుసు. అలాగే వైఎస్సార్ మరణం తర్వాత...సీఎం రేసులోకి వచ్చిన నాయకుడు. కానీ అనూహ్యంగా ఆయనకు పదవి దక్కలేదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత అంతా కాంగ్రెస్‌ని విడిచి వెళ్ళినా సరే బొత్స మాత్రం...ఆ పార్టీలోనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున పోటీ చేశారు. రాష్ట్రంలో మిగతా నాయకులు డిపాజిట్లు కోల్పోయినా సరే బొత్స మాత్రం ఓట్లు బాగానే తెచ్చుకున్నారు.

ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్తితి మరీ దారుణంగా తయారైంది..దీంతో రాజకీయ భవిష్యత్ కోసం....బొత్స వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలిచారు...అలాగే జగన్ క్యాబినెట్‌లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఈ మధ్య మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి అనేక కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి 100 శాతం మార్పులు జరగడం ఖాయమని ప్రచారం నడుస్తోంది.

అంటే బొత్స ఐదేళ్ల పాటు కంటిన్యూ అవ్వకుండానే బొత్స పదవి ఊడిపోతుంది. సీనియర్ నేతగా ఉన్న బొత్స పదవి పోవడం అంత సులువా? అంటే కష్టమే అని చెప్పాలి.  ఎందుకంటే బొత్స లాంటి వారు క్యాబినెట్‌లో ఉంటేనే...వైసీపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. బొత్స, పెద్దిరెడ్డి, బాలినేని లాంటి సీనియర్ల అవసరం జగన్‌కు ఎంతైనా ఉంది...అలాంటప్పుడు వారిని సైడ్ చేయడం వల్ల పార్టీకి కాస్త ఇబ్బంది అవుతుంది.


పైగా బొత్స లాంటి వారిని క్యాబినెట్‌లో నుంచి తప్పించడం వల్ల విజయనగరం జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే ఆయన సామాజికవర్గంపై కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే రెబల్ ఎంపీ రఘురామ సైతం...బొత్స, పెద్దిరెడ్డి లాంటి వారిని మంత్రివర్గం నుంచి తప్పించడం సాధ్యం కాదని అంటున్నారు. అంటే బొత్సని ఐదేళ్ల పాటు మంత్రివర్గంలో కంటిన్యూ చేస్తేనే వైసీపీకి ప్లస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: