ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలకు తగ్గట్టుగానే నాయకులు కూడా రాజకీయం చేస్తున్నారు. పరిస్తితులకు అనుగుణంగా వారు కూడా రాజకీయాల్లో దూకుడుగా ఉంటున్నారు. మొన్నటివరకు ప్రతిపక్ష టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హవా స్పష్టంగా ఉండటంతో టీడీపీ నేతలు చాలావరకు సైలెంట్‌గా ఉండిపోయారు. ఎక్కడ హడావిడి చేస్తే ఇబ్బందులు పడాలో అని చెప్పి ఆగారు.

కానీ ఇటీవల కాస్త రాజకీయం మారుతూ వస్తుంది..పూర్తిగా వైసీపీ హవా తగ్గకపోయినా సరే కొన్ని చోట్ల టీడీపీ పుంజుకుంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుండటంతో టీడీపీ నేతలు దూకుడు పెంచుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ సైతం ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఈయన...రాజాం బరిలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయాక కొండ్రు పూర్తిగా అండర్‌గ్రౌండ్‌కు వెళ్ళిపోయారు.

ఒకానొక సమయంలో ఈయన వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే కొండ్రు సైలెంట్ అవ్వడంతో రాజాంలో టీడీపీ బాధ్యతలు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి చూసుకుంటూ వచ్చారు. అసలు రాజాం సీటు భారతిదే...కానీ వరుసగా ఓడిపోతున్నారని చెప్పి, గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొండ్రుకు చంద్రబాబు సీటు ఇచ్చారు. కానీ ఆయన ఓడిపోయాక పార్టీ నుంచి సైడ్ అయ్యారు.

మళ్ళీ ఇప్పుడుప్పుడే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి..టీడీపీలో యాక్టివ్ అయ్యారు. పార్టీ తరుపున యాక్టివ్‌గా కార్యక్రమాలు చేస్తున్నారు. వైసీపీకి చెందిన క్యాడర్‌ని పార్టీలోకి తీసుకొస్తున్నారు. కొండ్రు ఎన్నికల వరకు ఇదే దూకుడు కంటిన్యూ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కానీ రాజాం సీటుపై భారతి కూడా ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ ఇద్దరిలో చంద్రబాబు ఎవరికి సీటు ఇస్తారనేది ఇప్పటిలో క్లారిటీ వచ్చేలా లేదు. ఒకరికి సీటు ఇస్తే...మరొకరికి వేరే విధంగా న్యాయం చేయాలి. మరి చూడాలి రాజాంలో టీడీపీ సీటు ఎవరికి దక్కుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: