చెప్పాడంటే.. చేస్తాడంతే! అనే మాట‌.. రాష్ట్ర రాజ‌కీయాల్లోనే కాదు.. దేశ‌రాజ‌కీయాల్లోనూ.. ఒక్క జ‌గ‌న్‌కు మాత్ర‌మే అన్వ‌యం అవుతుందన‌డంలో సందేహం లేదు. తాను న‌మ్మిన‌.. వారికే కాదు.. ప్రాంతాల‌కే కాదు.. త‌న‌నున‌మ్మిన వారికి..త న‌ను న‌మ్మిన ప్రాంతాల‌కు కూడా మేలు చేయ‌డంలో జ‌గ‌న‌ను మించిన వారు .. ఈ రాజ‌కీయాల్లోనే లేరంటే అతిశ‌యోక్తి కాదు. ప్రభుత్వ పథకాలను అత్యంత పారదర్శకంగా అందించ‌డంలోనే కాదు.. అందరికీ సంక్షేమ ఫలాలు స‌రిగా అందుతున్నాయో లేదో చూడ‌డంలోనూ.. ఆయ‌న ముందున్నారు.

నిజానికి ఇలాంటి విష‌యాల‌పై సమీక్ష చేస్తే.. అనేక లోపాలు ముందుకువ స్తాయి. ముఖ్యంగాడ‌బ్బులు స‌రిపోవ‌డం లేద‌నో.. ల‌బ్ధిదారులు పెరిగిపోతున్నార‌నో.. ప్ర‌భుత్వాలు భావిస్తుంటాయి. దీంతో ప‌థ‌కా ల‌పైనా.. సంక్షేమంపైనా.. పెద్ద‌గా దృష్టి పెట్ట‌వు. కానీ, ఇప్పుడు ఏపీలో ప‌రిస్థితి మారిపోయింది. ఎంత మంది ల‌బ్ధిదారులుఉంటే అంద‌రికీ వాటిని అందిస్తున్నారు. త‌తాజాగా.. ఆయ‌న  కడప జిల్లా పర్యటనలో  ఉన్నారు. త‌న‌ను న‌మ్మిన ప్రొద్దుటూరుకు ఈ  రెండున్నర ఏళ్లలో వంద‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. వీటిలో లబ్ధిదారులకు రూ.326 కోట్లు బదిలీ అయ్యాయి. అంతేకాదు.. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణం చేప‌ట్టారు.

ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు పైపులైనుకు శ్రీకారం చుట్టారు. ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలకు రూ.200 కోట్లు మంజూరు చేశారు. ప్రొద్దుటూరులో 10,220 మందికి ఇంటిస్థలాలు ఇచ్చారు.ఎంతో కాలంగా డిమాండ్‌లో ఉన్న‌ మైలవరం జలాశయం నుంచి 170 కి.మీ. పైపులైను నిర్మాణం చేపట్టారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు. రూ.163 కోట్లు కేటాయించారు.

 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైపు లైను ఏర్పాటు చేస్తున్నారు.  రూ.1600 కోట్ల వ్యయంతో మేజర్స్ సెంచరీ ప్లై పరిశ్రమను తాజాగా ప్రారంభించారు.  ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా 2 వేల మందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభించనుంది. మరో 18 చిన్న పరిశ్రమలకు సీఎం జగన్ తాజాగా శంకుస్థాపన చేశారు.  ఈ ప్రాజెక్టుల‌తో ప్రొద్దుటూరు రూపురేఖ‌లు అమాంతం మారిపోతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని గ‌మ‌నించిన వారు.. ఇది క‌దా.. న‌మ్మిన ప్ర‌జ‌ల‌కు ఏ నాయ‌కుడైనా చేయాల్సింది.. అని వ్యాఖ్యానిస్తున్నారు. సోష‌ల్ మీడియాలోనూ ఇదే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: