
అదేవిధంగా కోవిడ్ నేపథ్యంలో రేపటి చలో విజయవాడను
రద్దు చేసుకోవాలని కోరారు. తాము చెబుతున్నా వినిపించుకోకపోవడం
బాధాకరంగా ఉందని తాము ఇప్పటికీ చర్చలకు సానుకూలమే అని అన్నారు.
ఉద్యోగులదే తప్పు అని అంతా అంటున్నారు. ఆ అంతా లో అందరిలో సజ్జల కూడా ఉన్నారు.తాము సర్దిచెబుతున్నా వినిపించుకోకపోవడం తప్పు అని ఉద్యోగులను తప్పు బడుతున్నారు. జీతం ప్లే స్లిప్ చూసుకోమని పదే పదే చెబుతున్నా వినరేంటి? ఇది సబబు కాదని పాలనను స్తంభింపజేసేందుకు ఉద్యోగులు ఆడుతున్న డ్రామా ఇది అని వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. ఈ దశలో సజ్జల ఎంట్రీ ఇచ్చి కొన్ని విషయాలు చెప్పారు. జీఓలను వెనక్కు తీసుకోవడం కుదరని పని అని తేల్చేశారు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మరోసారి ఉద్యోగులపై సీరియస్ అయ్యారు.అంతేకాదు ఉద్యోగులకు మొండి పట్టుదలకు పోయి ప్రవర్తిస్తున్నారని అన్నారు. తాము ఎవ్వరికీ వ్యతిరేకంగా లేమని స్పష్టం చేశారు. ఎవరిని బెదిరిస్తున్నారని, ఎవరి ముందు మీరు బల ప్రదర్శన చేస్తారని అంటూ ఉద్యోగులకు ప్రశ్నాస్త్రాలు సంధించారు.ఇవాళ రాజధానిలో నిర్వహించిన మీడియా మీట్ లో రామకృష్ణా రెడ్డి పలు అంశాలపై స్పందించారు.
ఆర్టీసీ ఉద్యోగులను సమ్మెలోకి దింపి జనజీవన స్తంభింపజేయడం తగదని అన్నారు. తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అలా అని తాము ఉద్యోగులకు వ్యతిరేకంగా లేమని పదే చెప్పారు.ఇంతచెబుతున్నా ఉద్యోగులు వినిపించుకోవడం లేదని అన్నారు.ఈ నేపథ్యంలోఉద్యోగుల వాదన మరోలా ఉంది. తాము చీకటి జీవోలను రద్దు చేయాలనే కోరుతున్నామని, ఆ విధంగా జరగక పోతే సమ్మెకు వెళ్తామని అంటున్నారు.