చైనా వింటర్ ఒలంపిక్స్ ప్రారంభ వేడుకలు భారత్ బహిష్కరించింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న డ్రాగన్ చర్యలకు నిరసనగా భారత్ ప్రారంభ వేడుకలను బహిష్కరిస్తున్నట్లు  ప్రకటించింది. వింటర్ ఒలంపిక్స్ ప్రారంభోత్సవానికి భారత రాయబారి హాజరు కావడం లేదని వెల్లడించింది. గాల్వన్ సైనికుడిని చైనా టార్చ్ బేరర్ గా పేర్కొనడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్,రష్యా అధ్యక్షుడు పుతిన్, ఐదారుగురు సెంట్రల్ ఏషియా అధ్యక్షులు, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరవుతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ బీజింగ్ నగరంలో టార్చ్ రిలే జరిగింది. రెండేళ్ల క్రితం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ రేజిమెన్ కమాండర్ టార్చ్ బేరర్ గా రన్ లో పాల్గొనేందుకు చైనా చాన్స్ ఇచ్చింది. నిన్న జరిగిన ఒలంపిక్ టార్చ్  ర్యాలీలో సుమారు 1200 మంది టార్చ్ బేరర్ లు పాల్గొన్నారు. దాంట్లో 2020 జూన్ 15న గాల్వాన్ లో జరిగిన ఘర్షణ లో గాయపడ్డ రేజిమెన్ కమాండర్ క్యూ షాబావో ఉన్నట్లు చైనా గ్లోబల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. గాల్వన్ దాడిలో షాబావో తలకు గాయమైంది. స్కేటింగ్ ఛాంపియన్  వాంగ్మెన్ నుంచి అతను టార్చ్ ను అందుకున్నట్టు చెప్పారు. గాల్వాన్ దాడిలో చనిపోయినట్లు నలుగురు సైనికులను గతంలో చైనా సన్మానించింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు బీజింగ్ లో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్నాయి.

ఇందులో సుమారు 3వేల మంది అథ్లెట్లు, 109 వేర్వేరు విభాగాల్లో పోటీ పడుతున్నారు. బీజింగ్ లో జరిగే ఒలంపిక్స్ ను పలు దేశాలు బహిష్కరించాయి. అమెరికా,యూకె,కెనడా దౌత్యపరమైన బహిష్కరణను ప్రకటించాయి. ఆస్ట్రేలియా, ల్యూథిమేనియా, గుసావో కూడా ఇదే కోవలోకి చేరాయి. ఈ దేశాలనుంచి క్రీడల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను పంపినప్పటికీ మంత్రులు,ఇతర అధికారులు మాత్రం హాజరు కావడం లేదు. బీజింగ్ లో జరగనున్న వింటర్ ఒలంపిక్స్, పారా ఒలింపిక్స్, ఒలంపిక్స్ లో పాల్గొనడానికి చాలా దేశాలు దౌత్యపరమైన నిషేధాలను విధించాయి. చైనాకు ఉన్న మానవ హక్కుల ఉల్లంఘన రికార్డుల వల్ల పలు దేశాలు తమ దేశ అత్యున్నత అధికారులను ఒలంపిక్స్ కు పంపకూడదని నిర్ణయించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: