తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో కొన్ని సిట్టింగ్ సీట్లు కోల్పోనుందా? కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఓటమి అంచునా ఉన్నారా? అంటే ఉన్నారనే చెప్పొచ్చు..ఎలాగో 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు 2019 ఎన్నికల్లో గెలవలేదు..అంటే చాలా సిట్టింగ్ సీట్లని టీడీపీ కోల్పోయింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే..మళ్ళీ ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లారు. అయితే నలుగురు టీడీపీని వదిలేసిన సరే..అవి కూడా టీడీపీ సిట్టింగ్ సీట్లే.

ఇక వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లలో టీడీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయా? అంటే నాలుగు సీట్లలో రెండు సీట్లలో మాత్రమే టీడీపీకి ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది...కానీ గన్నవరం, చీరాలలో మాత్రం కాస్త అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు చోట్ల బలమైన నాయకులని పెడితే టీడీపీకి ఛాన్స్ ఉంటుంది..లేదంటే ఈ సీట్లు టీడీపీకి గెలుచుకునే అవకాశాలు లేవు. సరే జంపింగ్ ఎమ్మెల్యేలని పక్కనబెడితే...ప్రస్తుతం టీడీపీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

మరి ఈ 19 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమందికి మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? అంటే...కొందరికి మాత్రమే మళ్ళీ ఛాన్స్ ఉందని చెప్పొచ్చు...కొందరికి మాత్రం గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాస్త అవకాశాలు తక్కువ ఉన్న వారిలో ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌లకు కాస్త గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి.

అయితే వీరిలో కొందరు సీట్లు మార్చుకునే అవకాశాలు ఉన్నాయి..అలాగే కొందరికి సీట్లు దక్కకపోవచ్చు. గంటా శ్రీనివాసరావు సీటు మార్చుకునే అవకాశం ఉంది...అంటే విశాఖ నార్త్‌లో కొత్త అభ్యర్ధి రావొచ్చు. ఇటు ఉండి ఎమ్మెల్యే రామరాజుకు మళ్ళీ సీటు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మొత్తానికైతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొన్ని సిట్టింగ్ సీట్లు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: