విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ హవా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..జిల్లాపై బొత్సకు గట్టి పట్టు ఉంది..అలాగే పలు నియోజకవర్గాల్లో బొత్సకు కావాల్సిన వారే ఉన్నారు. బొత్స బంధువులు, సన్నిహితులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలా బొత్స సన్నిహితులుగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావులు ఉన్నారు.

ఈ ఇద్దరు నేతలు బొత్సకు సన్నిహితులే...ఇంకా చెప్పాలంటే బొత్స ప్రమేయంతోనే గత ఎన్నికల్లో ఈ ఇద్దరికి సీట్లు రావడం, గెలవడం జరిగాయి. పార్వతీపురంలో జోగారావు మంచి మెజారిటీతో గెలిచారు. అటు ఎస్ కోటలో శ్రీనివాసరావు కూడా మంచి మెజారిటీతోనే గెలిచారు..అయితే పార్వతీపురం, ఎస్ కోటలు తెలుగుదేశం పార్టీ కంచుకోటలు.  ముఖ్యంగా ఎస్ కోటలో టీడీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

కానీ గత ఎన్నికల్లో జగన్ గాలిలో అక్కడ టీడీపీ ఓడిపోవాల్సి వచ్చింది..అయితే ఈ సారి మాత్రం కోటలో వైసీపీకి ఛాన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు..ఇప్పటికే కోటలో టీడీపీ చాలావరకు పికప్ అయింది..అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కడుబండిపై ప్రజా వ్యతిరేకత కూడా ఎక్కువ పెరిగింది...రెండున్నర ఏళ్లలోనే ఎక్కువ ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. పైగా ప్రజలకు అందుబాటులో ఉండటంలో కూడా కడుబండి ఫెయిల్ అవుతున్నారు...దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో కోటలో కడుబండి మళ్ళీ గెలవడం చాలా కష్టమని సర్వేలు చెబుతున్నాయి..అసలు ఇక్కడ కడుబండికి సెకండ్ ఛాన్స్ లేదని తెలుస్తోంది.

అటు పార్వతీపురంలో కూడా అదే పరిస్తితి...ఇక్కడ ఎమ్మెల్యే జోగారావు పరిస్తితి అంత ఆశాజనకంగా లేదు...చాలావరకు ఈయనపై కూడా వ్యతిరేకత కనిపిస్తోంది..రెండున్నర ఏళ్లలో పార్వతీపురంలో జరిగిన అభివృద్ధి పెద్దగా లేదు...అలాగే ప్రజా సమస్యలని పరిష్కరించడంలో కూడా జోగారావు విఫలమవుతున్నారని తెలుస్తోంది..ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు బాగా దూకుడుగా ఉన్నారు..గత ఎన్నికల్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇక పార్వతీపురంలో పరిస్తితి చూస్తుంటే నెక్స్ట్ జోగారావుకు కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: