ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి.. ఇది యుద్ధానికి దారి తీయవచ్చని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. ఈ టైమ్‌లో తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది టెన్షన్‌ పడుతున్నారు. ఎందుకంటే.. ఉద్రిక్తతలు, యుద్ధవాతారవణం నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల గురించి చాలా ఆందోళన నెలకొంది.


అయితే.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కొన్ని కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌లో పరిస్థితుల దృష్ట్యా ఎంబసీ కార్యాలయంలో ఈ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 1800 118 797ను సంప్రదించవచ్చు. అలాగే
సమాచారం కోసం  011 2301 2113 నంబర్‌ను సంప్రదించొచ్చు.  అలాగే మరో నెంబర్‌   011 2301 4104 నంబర్‌ను కూడా సంప్రదించొచ్చు.

వీటితో పాటు  011 2301 7905ను కూడా సంప్రదించవచ్చని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీలో 24 గంటల హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేశామని.. వీటిని వినియోగించుకోవచ్చని విదేశాంగ శాఖ చెబుతోంది. భారత ఎంబసీలో హెల్ప్‌లైన్‌ నంబర్లు: 380 997300428, 997300483.. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా భారత ఎంబసీ ఈమేరకు  ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ పరిస్థితులపై తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని భారత ఎంబసీ ప్రకటించింది.


ఉక్రెయిన్‌లో చాలామంది భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని.. భారత్‌-ఉక్రెయిన్‌ మధ్య విమాన సర్వీసులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఎంబసీ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌లోని భారత పౌరుల సమాచారం కోసం కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశామని..
భారత రాయబార కార్యాలయంలో, విదేశాంగశాఖ కార్యాలయంలోనూ ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లను వినియోగించుకోవాలని ఎంబసీ కోరింది. ఉక్రెయిన్ లో ఉక్రెయిన్ విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థుల  తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతోంది. ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థుల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: