సాధారణం గా పెళ్లి సమయంలో పెళ్లి కూతురు ఎంతో సిగ్గు బియ్యం తో ఉంటుంది. కొంతమంది అయితే దించిన తల ఎత్తకుండా సిగ్గుపడుతూనే పెళ్లి చేసుకుంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం యువతులు ఎవరు కూడా ఇలా పెళ్లి సమయంలో సిగ్గుపడుతూ మాత్రం కనిపించడం లేదు. ఏకంగా ధూమ్ దాం ఎంజాయ్ చేస్తున్నారు. పురుషుల కంటే మేం ఎక్కడ తక్కువ కాదు అన్నట్లుగా అన్ని విషయాల్లో పోటీపడుతున్నారు నేటి రోజుల్లో యువతులు. ఇలా ఇటీవలి కాలంలో యువతులు తమ పెళ్లిళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.


 ఇక కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఆ పెళ్లి కుమారుడిని కూడా ఆటపట్టించడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పెళ్లి మండపం లోకి వచ్చిన పెళ్లికూతురు అప్పటివరకు ఎంతగానో సిగ్గు పడి పోయింది. దీంతో పాపం అమాయకురాలు అని అందరూ అనుకున్నారు. ఒక్కసారిగా అందరి ముందే పెళ్లి కూతురు చేసిన పనికి మాత్రం అందరూ పగలబడి నవ్వారు అని చెప్పాలి. ఇక ఇటీవలే పెళ్లి మండపంలో పెళ్లి కూతురు ఎంతో జోష్ గా డాన్స్ చేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. దీనికి సంబంధించి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.


 అయితే ఇటీవల కాలంలో పెళ్లి వేడుకలను అందరూ డాన్స్ చేస్తున్నారు కదా ఇందులో కొత్తగా ఏముంది అని అనుకుంటున్నారు కదా.  అయితే అందరూ మొదటినుంచి డాన్స్ చేస్తూ పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఒక పెళ్లి కూతురు మాత్రం ముందు ఎంతో సిగ్గుపడుతూ పెళ్లి మండపం లోకి ఎంట్రీ ఇస్తుంది.  వధూవరులిద్దరూ పక్కపక్కనే నిలబెడతారు. పక్కనే బ్యాండ్ మేళం కూడా ఉంటుంది. అయితే బ్యాండ్ మేళం మొదలవ్వగానే అప్పటివరకు సైలెంటుగా ఉన్న పెళ్లికూతురు ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.  నోట్లో కరెన్సి పెట్టుకొని మరి డాన్స్ చేస్తుంది. దీంతో మొదట షాక్ అయిన వరుడు తర్వాత ఆమె తో కాలు కదులుతాడు. ఇక ఇది చూసి ఎంతోమంది నవ్వుకుంటున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: