పెరిగిన ,పెరుగుతున్న పెట్రోల్ - డీజిల్ ధరలు పలు రకాల ట్రాన్స్పోర్ట్ లపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ప్రైవేట్ రవాణా మొదలు పబ్లిక్ రవాణా వరకు అన్ని వాహనాల రవాణాపై ప్రభావం పడింది. సగటు సామాన్యుడు ఆటో ఎక్కాలన్నా ఎంత ఛార్జ్ చేస్తారో అన్న భయం నెలకొంటోంది. రీసెంట్ గా ఆర్టీసి వారు టికెట్టు చార్జీలను పెంచగా.. ఇపుడు స్కూల్ బస్సు చార్జీలను సైతం పెంచేస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను చూపి పెద్ద మొత్తంలో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి వసూలు చేసి సొమ్ము చేసుకోవడం కోసం భారీగా స్కూల్స్, కాలేజెస్ వ్యాన్ ఫీజులను పెంచేస్తున్నారు.

ఈ క్రమంలో ఒక్కో విద్యార్థి వైపు నుండి వ్యాన్ ఫీజును అదనంగా నాలుగైదు వేల రూపాయల వరకు వసూలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.  ఎవరైతే విద్యార్థులు స్కూల్ బస్సు లేదా వ్యాన్ సౌకర్యాలను వినియోగిస్తున్నారో వారిపై అదనంగా భారాన్ని మోపడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు అయితే కిలో మీటర్ కు ఇంత అంటూ లెక్కకట్టి మారి వసూలు చేయడానికి రెడీ అయిపోయారట. ఇప్పటికే పలు విద్యా సంస్థలు వ్యాన్ మరియు బస్సు చార్జీలను భారీగా పెంచి తల్లితండ్రుల వద్ద నుండి వసూళ్లు చేస్తున్నారట.

అకాడమిక్ ఇయర్ మారనే లేదు ఇంతలోనే రవాణా చార్జీలు పెంచేయడంతో తల్లి తండ్రులు అవాక్ అవుతున్నారు. కానీ తప్పేది లేక చెల్లిస్తున్నారు. ఈ విధంగా ట్రాన్స్ పోర్ట్ చార్జీల బాదుడుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోంది. దాంతో తల్లి తండ్రులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు... ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గిస్తే ఇవన్నీ మళ్ళీ లైన్ మీదకు వస్తాయని భారం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పట్ల తెలంగాణ ప్రభుత్వం ఏమైనా దయ చూపిస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: