ఏపీ సీఎం జగన్‌ మ‌రోసారి అదిరిపోయే రికార్డు సృష్టించారు. దేశంలోనే బెస్ట్ సీఎంగా ఎన్నికయ్యారు. అది కూడా వరుసగా రెండోసారి ఈ స్థానంలో నిలిచి అరుదైన ఘనత దక్కించుకున్నారు. గ్రామీణాభివృద్ధి అనే కోణంలో స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో  ‘చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద అవార్డు’ను ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ దక్కించుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ఈ అవార్డుకు సీఎం జగన్ వరుసగా రెండోసారి ఎంపికయ్యారు.


ఈ జాబితా పరిశీలిస్తే..  రెండో బెస్ట్ సీఎంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ లిస్టులో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌ ఈ సర్వేలో అనేక విషయాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇలా ఏపీ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. స్కోచ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. సుపరిపాలన విషయంలోనూ ఏపీ టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. సుపరిపాలన విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే టాప్-5లో ఉండటం విశేషం. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం ఈ ఘనతను అందుకోకపోవడం విశేషమే.


ఈ జాబితాలో రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, మూడో స్థానంలో ఒడిశా, నాలుగో స్థానంలో గుజరాత్‌, ఐదో స్థానంలో మహారాష్ట్ర ఉన్నాయి.  స్కోచ్ సంస్థ ఏటా దేశంలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలనా విధానాలు, అమలు చేస్తున్న కొత్త సంస్కరణలు, ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అధ్యయనం చేస్తోంది. వాటి ఆధారంగా ర్యాంకులు ఇస్తుంది.


ఏపీలో జగన్ సీఎం అయ్యాక అనేక మార్పులు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలను చేరుతున్నాయి. ఈ అంశాల కారణంగానే  గ్రామీణాభివృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ మెరుగైన ర్యాంకులో నిలిచినట్టు భావిస్తున్నారు. తమ నేత దేశంలోనే బెస్ట్ సీఎంగా వరుసగా రెండోసారి నిలవడంపై వైయ‌స్ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: