తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటుపడదని స్పష్టమైపోయింది. రఘురాజుపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని, నరసాపురంలో మళ్ళీ ఉపఎన్నికలు తెప్పించాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకనే వైసీపీ తరపున ఒకటికి రెండుమూడుసార్లు అనర్హత పిటీషన్లు ఇప్పించారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై బాగా ఒత్తిడిపెట్టిన ఫలితంగా సభాహక్కుల సంఘం సమావేశాన్ని పెట్టించగలిగారంతే.





ఈ సమావేశంలోనే ఎంపీపై వైసీపీ చేసిన ఆరోపణలకు అనర్హత పిటీషన్ వర్తించదని సంఘం స్పష్టంగా చెప్పేసింది. ఇక్కడే జగన్ ఫెయిల్యూర్ కనబడుతోంది. అదేమిటంటే పార్టీలు జారీచేసిన విప్ ను ఉల్లంఘించినపుడు మాత్రమే అనర్హత వర్తిస్తుందని తెలుసుకోకపోవటం జగన్ తప్పు. రెండోది ఒకవేళ అనర్హత పిటీషన్ ఇచ్చిన తర్వాత తెరవెనుక తనపనయ్యేట్లుగా వర్కువుట్ చేసుకోలేకపోవటం రెండోతప్పు.





నిబంధనలకు విరుద్ధంగా తనపై అనర్హత వేటు వేస్తే రఘురాజు ఎలాగూ కోర్టుకెళతారు. ముందైతే అనర్హత వేటు పడిపోతుంది కాబట్టి కోర్టు కేసు తేలినపుడు తేలుతుంది. ఈపని జరగాలంటే నరేంద్రమోడి స్ధాయిలో బాగా ఒత్తిడి పెట్టాలి. ఇక్కడే జగన్లోని రెండో ఫెయిల్యూర్ కనబడుతోంది. ఇదే సమయంలో రఘురాజు బ్యాంకుల కన్సార్షియం దగ్గర వేల కోట్ల రూపాయలు అప్పుతీసుకుని ఎగొట్టారనే ఆరోపణలు నిజమే అని సీబీఐ తేల్చింది. ఈ మేరకు బ్యాంకుల కన్సార్షియం కూడా ఫిర్యాదుచేసింది.





ఈ పాయింట్ మీదైనా ఎంపీని సీబీఐతో అరెస్టుచేయించేట్లుగా మోడిపై ఒత్తిడి తేవటంలో జగన్ ఫెయిల్యూర్ కనబడుతోంది. సీబీఐ అరెస్టుచేసింది కాబట్టి రఘురాజుపై అనర్హత వేసేట్లుగా జగన్ ఒత్తిడి పెట్టుండచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవటంలో జగన్ విఫలమయ్యారు. హోలు మొత్తంమీద ఎంపీపై తాను అనుకున్నట్లుగా లోక్ సభ యాక్షన్ తీసుకునేట్లుగా చేయటంలో జగన్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడుతోంది. కేంద్రానికి మద్దతివ్వటం వల్ల ఇటు రాష్ట్రానికీ ఉపయోగం లేక పార్టీపరంగా రాజకీయ ప్రయోజనాలను సాధించుకోలేనపుడు ఇక మోడికి ఎందుకు జగన్ మద్దతుగా నిలవాలి ? వ్యక్తిగత ప్రయోజనాలైనా సాధించుకుంటున్నారా అనేదే ఇపుడు సందేహంగా మిగిలిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: