నరేంద్రమోడీ భయపడుతున్నారా ? అవుననే అంటున్నారు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేజ్రీవాల్ వ్యాఖ్యల్లో తప్పేమీలేదనే అనిపిస్తోంది. విషయం ఏమిటంటే ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ లోని ఆప్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేశారు. దాదాపు 2 గంటలపాటు తనిఖీలు చేసినా ఏమీ దొరకలేదు. అసలు ఏమి ఆశించి సోదాలు జరిపారో ఎందుకు వెళిపోయారో అర్ధం కావటంలేదు.





రెండు రోజుల పర్యటన నిమ్మితం కేజ్రీవాల్ గుజరాత్ లో అడుగుపెట్టగానే ఆప్ కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేయటం ఆశ్చర్యంగా ఉంది. వారం రోజుల క్రితం ఢిల్లీలోని ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆఫీసు, ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రెండురోజుల పాటు నిర్వహించిన సోదాల్లో సీబీఐకి ఏమీ దొరకలేదు. ఆమధ్య డైరెక్టుగా సెక్రటేరియట్ లోని కేజ్రీవాల్ కార్యాలయంలోనే సీబీఐ సోదాలు జరపటం సంచలనం సృష్టించింది. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఫైళ్ళను సీబీఐ పట్టుకుని వెళ్ళి తర్వాత తిరిగిచ్చేసింది.






తాజాగా వెయ్యి లో ఫ్లోర్ బస్సుల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఎవరో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సీబీఐ విచారణకు ఆదేశించారు. ఆప్ మంత్రులు, ఎంఎల్ఏల ఇళ్ళలో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. ఇదంతా చూస్తుంటే కేజ్రీవాల్ అంటే మోడీలో భయం మొదలైందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.






ఎందుకంటే ఒకపుడు ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ఆప్ ఇపుడు పంజాబ్ లో జెండా నాటింది. మంచి మెజారిటీతో పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటుచేసింది. తమ తదుపరి టార్గెట్ గుజరాతే అని కేజ్రీవాల్ ప్రకటించి మరీ టార్గెట్ గా పెట్టుకున్నారు. గుజరాత్ లో ఆప్ పుంజుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీల్లో ఆప్ కొర్పొరేటర్లు, కౌన్సిలర్లున్నారు. ఈ ఏడాది చివరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీని ఆప్ దెబ్బకొడుతుందనే ప్రచారం పెరిగిపోతోంది. గుజరాత్ లో బీజేపీకి ఇబ్బందులు మొదలైతే మోడీ బేస్ కదిలినట్లే. ఇందుకనే పార్టీగా ఆప్ ను ఏమీ చేయలేందు కాబట్టి కేంద్రప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని కేజ్రీవాల్ ను ఇబ్బందులకు గురిచేస్తోందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: