అధికారపార్టీలో కూడా ధిక్కారాలు పెరిగిపోతున్నాయా ? తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలోనే ఈ విషయం బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం అమలుపై జగన్ సమీక్షచేశారు. ఈ సమీక్షలో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు హాజరయ్యారు. జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో అందరు పాల్గొనాల్సిందే అని మొదటినుండి చెబుతున్నారు.





కార్యక్రమంలో పాల్గొనే ప్రజాప్రతినిధులపై వచ్చే ఫీడ్ బ్యాక్ మీద టికెట్ల కేటాయింపు ఆధారపడుందని పదే పదే చెబుతునే ఉన్నారు. ఇప్పటికి మూడుసార్లు సమీక్షలు నిర్వహించారు. ప్రతిసారి కొందరికి క్లాసులు పీకుతునే ఉన్నారు. డైరెక్టుగా అందరిముందే కార్యక్రమంలో సరిగా పార్టిసిపేట్ చేయని వాళ్ళని మందలిస్తున్నారు. అయితే కొందరి పనితీరులో ఏమాత్రం మార్పురావటంలేదు.





తాజాగా జరిగిన సమీక్షలో మంత్రులు, ఎంఎల్ఏలు మొత్తం 27 మంది పనితీరు ఏమాత్రం బావోలేదని జగన్ తీవ్ర అసంతృప్తిం వ్యక్తంచేశారు. వీళ్ళందరికీ పేరుపేరునా జగన్ అందరిముందే ఫుల్లుగా క్లాసుతీసుకున్నారు.  తర్వాత సమీక్ష నవంబర్లో ఉంటుందని అప్పటికి పనితీరు మెరుగుపరుచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు తానేటివనిత, రోజా, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, విశ్వరూప్ తో పాటు మాజీ మంత్రులు ఆళ్ళనాని, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులతో పాటు ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. నవంబర్లో కూడా పనితీరు మార్చుకోని వాళ్ళకి టికెట్లు ఇచ్చేదిలేదని స్పష్టంగా చెప్పేశారు.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పదే పదే చెబుతున్నా ఆళ్ళనని, వనిత, బాలినేని, బుగ్గన లాంటి వాళ్ళు జగన్ను లెక్కేచేయటంలేదు. టికెట్లిచ్చేది లేదని వార్నింగులిస్తున్నా కార్యక్రమంలో పాల్గొనటానికి ఏమాత్రం ఇష్టపడటంలేదు. ఏదో తూతూమంత్రంగా ఎక్కడో పాల్గొన్నామనిపిస్తున్నారంతే. అదికూడా జగన్ భయంవల్ల మొక్కుబడిగా పాల్గొంటున్నారు కానీ పార్టీ కార్యక్రమంలో పాల్గొనాలన్న కమిట్మెంట్ కనబడటంలేదు. టికెట్లు ఇవ్వకపోయినా పర్వాలేదన్న ధీమానా లేకపోతే తమకు తప్ప ఇంకోరికి టికెట్లు ఇవ్వడన్న నమ్మకమో అర్ధం కావటంలేదు. మొత్తానికి వీళ్ళకి జగన్ అంటే లెక్కలేదన్న విషయం అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: